Aadhaar card download చేసుకోవడం చాలా సులభం. మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ క్రింది స్టెప్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి:
- అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి
స్టెప్ 1
మీ మొబైల్ లేదా కంప్యూటర్ బ్రౌజర్‌లో UIDAI అధికారిక వెబ్‌సైట్ అయిన myaadhaar.uidai.gov.in ఓపెన్ చేయండి. - డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకోండి
స్టెప్ 2
హోమ్‌పేజీలో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ‘Download Aadhaar’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. - మీ వివరాలను ఎంటర్ చేయండి
స్టెప్ 3
ఇక్కడ మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి:
Aadhaar Number (మీ దగ్గర పాత ఆధార్ నంబర్ ఉంటే)
Enrollment ID – EID (కొత్తగా అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిన రశీదు నంబర్)
Virtual ID – VID
మీ దగ్గర ఉన్న ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని, ఆ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత కింద ఉన్న Captcha Code (అక్షరాలు/అంకెలు) ని ఉన్నది ఉన్నట్లుగా బాక్స్‌లో టైప్ చేయండి. - OTP వెరిఫికేషన్ చేయండి
స్టె4
వివరాలు ఎంటర్ చేసాక ‘Send OTP’ బటన్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆ OTPని అక్కడ ఎంటర్ చేయండి.
(గమనిక: మీకు ఆధార్ నంబర్ పూర్తిగా కనిపించకూడదు అనుకుంటే, అక్కడ ‘Do you want a masked Aadhaar?’ అనే టిక్ బాక్స్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు). - ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండి
స్టెప్ 5
OTP ఎంటర్ చేసాక ‘Verify & Download’ పై క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ PDF ఫార్మాట్‌లో మీ ఫోన్ లేదా కంప్యూటర్ లోకి డౌన్‌లోడ్ అవుతుంది.
⚠️ ముఖ్యమైన గమనిక (PDF పాస్‌వర్డ్):
డౌన్‌లోడ్ అయిన ఆధార్ PDF ఫైల్ ఓపెన్ అవ్వడానికి ఒక పాస్‌వర్డ్ అడుగుతుంది. ఆ పాస్‌వర్డ్ ఇలా ఉంటుంది:
మీ పేరులోని మొదటి 4 అక్షరాలు (Capital Letters లో) మరియు మీరు పుట్టిన సంవత్సరం (YYYY).
ఉదాహరణకు: మీ పేరు SURESH అయి, మీరు 1995 లో పుడితే… మీ పాస్‌వర్డ్ SURE1995 అవుతుంది.