నీ ఆలోచనే – నీకు ఆయుదం
Your Thoughts is a Best Weapon for Success of Life
అత్వవసర సమయం లో ఆయుదం లేదని ఓడిపోకు నీ ఆలోచనే నీకున్న మహా పెద్దాయుదం అని తెలుసుకో.
మానవుడి పుట్టుక మొదలకున్న దగ్గర నుండి ఇప్పటి వరకు మానవుడి జన్మకు సరైన సమాధానాలు దొరకక పోవచ్చు. కానీ భూమి పై జీవించే అనేకమైన జీవరాశులలో మానవుడు జన్మ ఎంతో గొప్పదని చెప్పుకుంటాము. మానవుని జన్మ రహస్యానికి ఇంకెన్ని ప్రశ్నలు ఉంటయ్యో మనందరికి తెలిసిన విషయమే. అస్సలికి మానవుడు ఆలోచన శక్తి కన్న గొప్పది ఈ ప్రప్రంచంలో ఉంటాయా ? అంటే చెప్పలేము , ఉండి ఉండ వచ్చు అని కొందరు , లేవని మరికొందరు అంటారు. కానీ ఈ రోజు మానవుడు ఎంత అధ్బుతాన్ని శృష్టిస్తున్నాడో ప్రపంచ మొత్తము చూస్తుంది. నిజంగా మానవుని శక్తిని ఎవ్వరు.? , ఏమిటో తెలుసుకుందాము.
ప్రతీ మనిషి కి జన్మించిన దగ్గర నుండి బుడి బుడి అడుగులు వేసే దాకా ఏమి కావోలో , ఏమీస్తే సంతోషంగా ఉండాలగడో వాటిని గమనిస్తాడు. పసిపాప వయస్సులో ఏడిస్తే ఆకలి కావచ్చు , ఇంకేదైనా నొప్పిని భరిస్తుండొచ్చు ఆ సమయం లో కన్న వారు ఆ ఆకలిని తీర్చేసే సరికి మనస్సుతో నవ్వుతూ ఉంటారు. అంటే ఆ బాదలు ఎలా తెలియ జేయాలో నేర్చుకుంటాడు మానవుడు. అప్పటి నుండి తుది శ్వాస విడిచే దాక సమస్య నుండి భయట పడటం కోసం ఆలోచనలు మొదలవుతాయి.
అలా దిన దినం పెరిగి పెద్దయ్యిన తర్వాతకి తనకు కావలసిన వాటి ని సాదించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఆ ప్రయత్నాలలో ఎన్నో విజయాలు , అపజయాలు చూస్తు నేర్చుకుంటున్న తరుణం లో ఒక్కసారిగా వెన్నకి తిరిగి చూస్తుకుంటే అప్పటి నుండి ఇప్పటి అభివృద్ది ఏంటనేది తెలుసుకున్న మానవుడు నా అలోచన శక్తి నాకు ఆయుదము అని తమ పై తాను విశ్వాసాన్ని పెంచుకుంటాడు మానవుడు.
సాదించాలని కాని – ఓడించాలని కాని తపన , తాపత్ర్యం , పట్టు దల మీలో ఉంటే చాలు మరోకరి ఆసర , ఇంకొకరిపై ఆదాపడకుండా నీ ఆలోచనే నీకు ఆయుదముగా ఉపయోగించు కుంటు ముందుకు సాగుతూ పోతే అది ఎప్పుడు తరిగిపోని ఆయుదము గా నీ ఆలోచన శక్తి పదును అవుతుందని తెలుసుకో మిత్రమా.
జీవితంలో ఎప్పుడు ఒకరి పై ఆధారపడటం కానీ చేయకుండా నీలో చాలా శక్తులున్నాయి అవ్వేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి మిత్రమా. తర్వాత నీ స్తానం ఎక్కడ అనుకుంటే అక్కడ చేరిపో గలవు మిత్రమా.! తెలిసిందిగా… ఆయుదం లేదని బాదపడకు యుద్దం లో కానీ పోటి లో గాని ఒక్క సారి ఆలోచించి నిర్ణయం తీసుకో ఎన్ని ఆయుదాలు ఎదురొచ్చినా నీ ఆలోచననే మహా పెద్ద ఆయుదం దాన్ని వాడటం మారచి పోకు మిత్రమా.!
గమనిక (Note ) : ఇందులో ఏవన్న తప్పులు దొర్లి ఉంటే టైపింగ్ వల్ల జరిగి ఉంటుందని భావించండి. అంతే కాదు ఇది మీకు నచ్చితే వెంటనే కామెంట్లో తెలియ జేయగలరని ఆశిస్తున్నాను.
****** Your Mahesh Karthik*****
Super Mahesh