వెంకాయ పల్లె ఎల్లమ్మ పూర్వ చరిత్ర / VENKAYA PALLE YELLAMMA PREHISTORIC KURNOOL( Andhra Pradesh- INDIA )
______________________________________________
కర్నూలు జిల్లా పరిధిలోని వెంకాయపల్లె ఎల్లమ్మ దేవస్థానం అనగానే ప్రతీ మంగళవారం మరియు శుక్రవారం ఎల్లమ్మ దేవస్థానానికి ప్రజలు దూర ప్రాంతాల నుండి తండోప తండాలుగు తరలి వస్తుంటారు అమ్మవారి ఆశీశుల / దీవెనల కోసం. ఎందుకు ఇంత జనాభా రావడాకి కారణం తెలుసుకునే ముందు ఈ ఎల్లమ్మ దేవస్థానం యొక్క పూర్వ చరిత్ర ఎమీటో తెలుసుకోవాలసిన అవసరం ఉంది.
కర్నూలు జిల్లా వెంకాయ పల్లే గ్రామం నివాసిరాలు అయినా పాపమ్మ అనే యువతి తన పొలం లో పనులు చేసుకుంటు జీవనం సాగించే వారు. కానీ ఒకనాడు అకస్మాతుగా పూనకం వచ్చి ఊగిపోతూ ఈ ప్రాంతాన నేను ఇంకి ఉన్నాను అంటూ ఆమె పొలం ప్రక్కన ఉన్న ఈత చెట్ల మద్యలోకి వెల్లి పూనకంతో ఊగిపోతు ఇక్కడ నేను ఉన్నాను నాకు గుడి నిర్మించి పూజలు జరిపించండి అని చెప్పిందని కొందరు తెలిపినట్టి విషయం. అంతే కాదు పాపమ్మతో పాటుగా పని చేస్తున్న తోటి మహిళలు అయిన మాదిగ కులస్తులైన వీరికి దగ్గర నీటి బుడగలు రావడంతో ఆచర్యపోయ్యిన వీరి పూనకంతో ఉన్న పాపమ్మ నాకు సేవకులుగా మీరుండాలని మీ కష్టానికి తగ్గ ప్రతిఫలము నేను ఇస్తానని చెప్పినట్టు కొందరి వాదనలు. కానీ పాపమ్మ అనే ఈమే తన జీవితాన్ని అమ్మకు అర్పించి సేవించింది. కొంత కాలానికి ఆమెకు ఒక ఆడబిడ్డ పుట్టిందంట చిన్నక్క అనే పేరుతో పెరిగి తల్లి సేవలో నిమగ్నమై పోయిన్నట్లు అదే విధముగా తనవలె భర్త లేకుండా సంతానం కనడం ఇష్టం లేని పాపమ్మ తన కూతుర్ని చిన్ననాగన్న అనే అతనితొ వివాహం జరిపించింది.
చిన్నక్క రేణుకాదేవి వలె 5 మంది పుత్రుల్ని కన్నది అని మరి కొందరి వాదనలు. తర్వాతి కాలంలో వీరందరు పెద్దవారై పెళ్ళిల్లు చేసుకుని సంతానవృద్దిని పొందినట్లు సమాచారం. ఇలా వారి వంశ పార్యం పరంగా వెంకాయ పల్లె ఎల్లమ్మను కొలుస్థూ ఆ చుట్టు ప్రాంతాల వారు కూడా తమ ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి అంటూ కొలుస్తు రావడం అయినదంట. కానీ పూర్వం నుండి ఉన్న మాదిగ మాతంగి గుడిలో ఉన్న ఎల్లమ్మ తల్లి కుమారుడైన పరుశ రాముడు ఏమైనాడు.. అని ప్రజలకి అంతు చిక్కని ప్రశ్న.
ఎప్పటి నుండో ఉన్న 2 విగ్రహాలను ఒకటిగా మారి కొత్తగా మార్పులు చేయండం ఏంటి .? అంటూ జ్యోతిష్యుల మరియు భక్తులకు ఒక ప్రశ్నగా మారింది.