వ్యవసాయ రంగ సామాజిక బాధ్యత నుండి పాలకులు తప్పుకోవడం..
సరైన పరిష్కారం కాదు…!
————-
రాయలసీమ సాంస్కృతిక వేదిక
——————-
కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ లో ఆర్డినెన్స్ లుగా, సెప్టెంబరు లో దిగువ చట్టాలను తీసుకొచ్చింది.
అవి….
1. నిత్యావసర వస్తువుల సవరణ ఆర్డినెన్స్.
2. రైతు ఉత్పాదనల వ్యాపార, వాణిజ్య ఆర్డినెన్స్.
3. ధరలపై రైతుల ఒప్పందం, వ్యవసాయ సేవా ఆర్డినెన్స్…. ఈ మూడు చట్టాలు వినడానికి చాల ఆసక్తిగా ఉన్నా, అమలులోకి వచ్చి వాటి ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయో చూస్తే.. కొన్ని అంశాలు అర్థమవుతున్నాయి.
వ్యవసాయ రంగ సామాజిక బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకోవడమే వీటి అంతరార్థంంగా ఉంది. ఈ మూడు చట్టాలు భారత వ్యవసాయరంగాన్నీ కార్పొరేట్ కంపెనీల పాలు చేయడమే ప్రధాన ఉద్దేశం.
ఈ దేశంలో భవిష్యత్తు లో ఒక బలమైన శక్తిగా రైతాంగం ఎదగబోతుంది. అన్ని వర్గాల మద్దతు ఎప్పటికీ రైతాంగానికి ఉంటుంది. ఇలాంటి శక్తివంతమైన వ్యవస్థ రూపుదిద్దుకోవడం పాలకులకు ఇష్టం ఉండదు. ఎక్కడికక్కడ చిన్నాభిన్నం కావాలి.
ఎవరి దారి వారు చూసుకొనే పరిస్థితి కల్పించాలి.
వ్యవసాయ ఒక సమీకృత జీవన విధానం అనే స్థాయి నుండి దాన్ని పూర్తిగా వాణిజ్య అంశంగా మార్చేయడమే అజెండా..
1.నిత్యావసర సరుకులపై ప్రభుత్వం నియంత్రణ పరిధిలో లేకుండా ఓపెన్ మార్కెట్ లో కార్పోరేట్ పాలు చేస్తోంది.
రేపు ప్రజల నిత్యావసర సరుకుల భవిష్యత్తును కార్పోరేట్ కంపెనీలు నిర్ణయిస్తాయి. వాటి ధర, డిమాండ్ కొన్ని కంపెనీల చేతిలో ఉంటుంది.
ప్రభుత్వం ఇన్నాళ్ళు ఎంతో కట్టుదిట్టంగా చట్టాలు అమలు చేసి, నియంత్రణ చేసినా నిత్యావసర సరుకుల విషయంగా సమస్యలు తప్పడం లేదు. రేపు కంపెనీల పరమైతే వినియోగదారులను కాపాడేవారెవరు..?
2. రైతుల ఉత్పాదనలు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే మాట విశాలంగా ఉన్నా…
ఆ అమ్మే క్రమంలో కష్టనష్టాలకు ప్రభుత్వం బాధ్యత ఉండదు. పంటకు సరైన గిట్టుబాటు లేక పోతే కనీస మద్దతు ధర ప్రభుత్వం ఇన్నాళ్ళు కల్పిస్తుంది. రేపటి రోజున మీ పంట మీ ఇష్టం అనే తరహాలో కనీస మద్దతు ధర ఇవ్వడం అనే కీలక బాధ్యత నుండి తప్పుకొంటుంది.
కార్పోరేట్ కంపెనీలు ఆయా రాష్ట్రాలలో అడ్డు ఆపు లేకుండా , రాష్ట్రాల అవసరాలతో పని లేకుండా జొరబడి ఉత్పాదనలు కొనే హక్కు కల్పిస్తుంది.
3. కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకొని వ్యవసాయం చేయడం. కంపెనీ నిభందనలతో వ్యవసాయం చేయడం అంటే ప్రభుత్వం రుణాలు, సబ్సిడీలు, భీమా ఇలా పలు అంశాలలో తన బాధ్యత వదులుకొంటుంది.
ఒక సారి ఒప్పందం లో కలిశాక ఇక ఆ చట్రం లో నుండి రైతులు బయట పడలేక చివరకు భూములు పోయే పరిస్థితి దాపురిస్తుంది. రైతు తన భూమిలో దూరదృష్టితో పంటలు, ఎరువులు, మందులు వాడకం జరుగుతుంది.
కార్పోరేట్ కంపెనీలు తమకు నచ్చిన పద్దతులలో రసాయనాలు వాడి పదేళ్ళలో ఆ భూమి ఎందుకు పనికిరాని స్థితికి తీసుకొస్తారు.
దీర్ఘ కాలంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
రైతులకు కొంత మొత్తం ఇచ్చి ఐదేళ్ళు అగ్రిమెంట్ చేసుకొనే పద్దతిలో చట్టం చేసినంత సులభంగా, ఆ ఐదేళ్ళ లాభాలలో కూడా భూమి ఇచ్చిన రైతులకు వాటా ఇవ్వాలని ఎందుకు చేయలేదు..?
అసలు.. పై మూడు చట్టాలు కావాలని, అవి అవసరమని, వాటి ద్వారా తమ సమస్యలు తీరతాయని ఈ దేశంలో ఏ ఒక రైతయినా అడిగారా..?
ఎవరి ప్రయోజనాల కోసం ఈ చట్టాలు చేసారు..?
అనేక పరిష్కార మార్గాలు ఉండగా కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా ఈ చట్టాలుండటంలో అంతర్యం ఏమి.?
ప్రస్తుత భారత దేశ వ్యవసాయ రంగానికి ఈ మూడు చట్టాలు అత్యంత ప్రమాదకరం.
వ్యవసాయ రంగంపై అన్ని అంశాలు ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగాలి. స్వామినాథన్ , జయతీ ఘోష్ ఇంకా పలు అధ్యయనాల, సిఫారసులను పరిగణలోకి తీసుకోని ఉన్న చట్టాలనే మరింత బలోపేతం చేసి వ్యవసాయ రంగానికి అండగా నిలవాలి.
కనీస మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం, ఇతర రైతుల అవసరాలపై కొంత బాధ్యత వహిస్తే చాలు. భారత వ్యవసాయ రంగానికి ప్రస్తుతం ఉన్న చట్టాలను కొంత మెరుగు పరుచుకొంటే మంచి భవిష్యత్తు ఉంది.
తెల్ల వెంట్రుకలు వచ్చాయని తల నరక్కోలేము కదా..
అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వ్యవసాయ రంగ బాధ్యతల నుండి ప్రభుత్వ తప్పుకోవడం దారి తప్పడమే అవుతుంది. తక్షణం ఈ మూడు చట్టాలను రద్దు చేసి .. భారత వ్యవసాయ రంగాన్ని కాపాడాలి. అందుకోసం జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి కారణం
www.smteluguspoorthi.com
Very good informations
Thanks given information
Good support