Spread the love
AP ANGANWADI HELPER AND ASHAWORKER JOBS

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 

చిత్తూరు జిల్లా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడీ ఉద్యోగాల నియమకాలు -2021 – ప్రకటన

దరఖాస్తు : 

1. అంగన్వాడీల నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రోఫార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజులలోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి . దరఖాస్తులను సంబందిత ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ కార్యాలయంలో లేదా https://chittoor.ap.gov.in/ నుండి పొంది , తిరిగి సంబందిత ఐ.సి.డి.ఎస్ . ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును .

అర్హతలు

2. అంగన్వాడి కార్యకర్త , మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును . 

3. అభ్యర్థులు వివాహితులు అయిన స్థానికులు అయి ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామములో స్థానికులు అయి ఉండవలెను .

4. 01.07.2021 నాటికీ దరఖాస్తుచేయు అభ్యర్థుల వయస్సు 21 సం.లు. నుండి 35 సం.లు లోపల వారు అయియుండవలెను . 

5. అంగన్వాడీ సహాయకురాలు ఎవరైనా అంగన్వాడీ కార్యకర్తకు దరఖాస్తు చేసుకోవాలంటే జి.ఓ.ఏం.ఎస్ . నెం .102 , తేది : 28.03.2011 మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారము గరిష్ట వయసు 45 సం.లు , 

6. యస్.సి , మరియు యస్.టి. ప్రాంతములలో గల యస్.సి. మరియు యస్.టి. అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు . 

7. అంగన్వాడి కార్యకర్త / అంగన్వాడి సహాయకురాలు పోస్ట్ కొరకు యస్.సి. మరియు యస్.టి. హాబిటేషన్స్ నందు యస్.సి. మరియు యస్.టి. అభ్యర్థులు మాత్రమే అర్హులు .

గౌరవ వేతనం 
8. అంగన్వాడి కార్యకర్త , మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవవేతనం చెల్లించబడును . ప్రస్తుతము జూలై 2019 నుండి అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం : రూ .11500 / నెలకు , మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం : రూ .7000 / – నెలకు మరియు అంగన్వాడీ హెల్పెర్ గౌరవ వేతనం : రూ .7000 / – నెలకు జి.ఓ. ఏం.ఎస్.నెం .13 WCD & SC ( PROGS ) తేది : 26.06.2019 ప్రకారం చెల్లించబడును .

జతపరచవలసినవి 9. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కులం ( యస్.సి యస్.టి / బి.సి . అయితే ) , నివాసము , పుట్టిన తేది , పదవ తరగతి మార్క్స్ మెమో , ఆధార్ , వికలాంగత్వముకు సంబందించిన పత్రములను గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసినవి జతపరచవలయును . 10. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే , తప్పనిసరిగా టి.సి. / స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి . స్రుటిని సమయములో సిడిపిఓ ఎటువంటి అవకతవకలుకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి .

జతపరచవలసినవి :
9. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కులం ( యస్.సి యస్.టి / బి.సి . అయితే ) , నివాసము , పుట్టిన తేది , పదవ తరగతి మార్క్స్ మెమో , ఆధార్ , వికలాంగత్వముకు సంబందించిన పత్రములను గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసినవి జతపరచవలయును . 10. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే , తప్పనిసరిగా టి.సి. / స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి . స్రుటిని సమయములో సిడిపిఓ ఎటువంటి అవకతవకలుకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి .
11. కులము , నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారీచేయబడిన పత్రములను గెజిటెడ్ అధికారి చే ధృవీకరణ చేసినవి జతపరచవలయును . 
12. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటో ను ముందు భాగములో అతికించి , ఫోటో ఏదేని గెజిటెడ్ అధికారితో ధృవీకరణ చేయవలయును . 
13. దరఖాస్తులను స్వయముగా సమర్పించవచ్చు మరియు తపాలా ద్వారా కూడా సమర్పించవచ్చు . 14. పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి . ఏ సమయములో నైనా పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము మరియు మార్పు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు .

రిజర్వేషన్ : 
1. ఎ.పి.రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ యొక్క నియమం 22 ప్రకారం రిజర్వేషన్ల నియమం అనుసరించబడుతుంది . 
2. EWS : ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 % రిజర్వేషన్ జి.ఓ , ఎం.ఎస్ . నం .66 , GA ( Ser.D ) Dt.14.7.2021 మరియు జి.ఓ. ఎం.ఎస్ . నం . 13 GA ( Ser.D ) తేదీ : 04-08-2021 అనుసరించబడుతుంది . 
3. BC – E కింది కి చెందిన అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక గౌరవ న్యాయస్థానముల తుది తీర్పునకు మరియు ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉండును .
నియామక పద్ధతి :
ప్రభుత్వం జి.ఓ. నం . 18 మహిళలు , పిల్లలు ( ప్రోగ్ ) వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ తేదీ : 15.05.2015 ప్రకారం , అంగన్‌వాడీ వర్కర్లు , మినీ అంగన్‌వాడీ వర్కర్లు మరియు అంగన్‌వాడీ హెల్పర్ల నియామకాల కోసం జిల్లా స్థాయి ఎంపిక కమిటీని అన్ని సమీకృత శిశు అభివృద్ధి సేవల ( ఐసిడిఎస్ ) ప్రాజెక్ట్ లో పునర్నియమించింది మరియు అంగన్‌వాడీ వర్కర్లు , మినీ అంగన్‌వాడీ వర్కర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ల ఎంపిక కోసం క్రింద వివరించిన విధంగా పారామీటర్లు ప్రమాణాలు సవరించడం జరిగింది . పునర్నియమించిన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ 
1 ) జిల్లా కలెక్టర్ / చైర్ పర్సన్ జిల్లా స్త్రీ & శిశు అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ 
2 ) సంబంధిత రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ – సభ్యులు 
3 ) జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ / అదనపు జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ – సభ్యులు 
4 ) సి.డి.పి.ఓ. సంబంధిత – సభ్యులు 
5 ) 5.పథక సంచాలకులు , జిల్లా స్త్రీ & శిశు అభివృద్ధి సంస్థ సభ్యులు- కన్వీనర్ పారామీటరు / ప్రమాణాలు 
One thought on “Anganwadi Helper and Asha worker Jobs in Chittoor | చిత్తూరు లోని అంగన్వాడీ ఉద్యోగాలు | Anganwadi Ashavarkar and Karyakartha”

Comments are closed.