CSK Vs SRH live scores sunrises put easy target for Chennai Super Kings

Spread the love

IPL NEWS 2023

CSK Vs SRH live scores sunrises put easy target for Chennai Super Kings

READ IN ENGLISH

CSK vs SRH Live Scores IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) బ్యాటింగ్ మరోసారి చేతులెత్తేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023)లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరుగుతున్న పోరులో హైదరాబాద్ బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు.

తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ల ఉచ్చులో పడిపోయింది. దాంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేసింది.

CSK VS SRH LIVE scores sunrises put easy target for Chennai Super Kings

రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రెచ్చిపోయాడు. తీక్షణ, ఆకాశ్ సింగ్, పతిరణలు తలా ఒక వికెట్ సాధించారు. సన్ రైజర్స్ తరఫున అభిషేక్ శర్మ (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాహుల్ త్రిపాఠి (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు.

టాస్ గెలిచిన ధోని హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. తొలి వికెట్ కు బ్రూక్ (18), అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 35 పరుగులు జోడించారు. అనంతరం బ్రూక్ పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ ఆడటంతో సన్ రైజర్స్ మరో వికెట్ పడకుండా 71 పరుగులకు చేరుకుంది. అయితే ఇక్కడి నుంచే మ్యాచ్ మొత్తం మారిపోయింది.

బౌలింగ్ కు వచ్చిన జడేజా, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలను అవుట్ చేశాడు. తీక్షణ బౌలింగ్ లో మార్క్రమ్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వెంటనే జడేజా బౌలింగ్ లో ముందుకు వచ్చి ఆడే ప్రయంత్నం చేసిన మయాంక్ అగర్వాల్ స్టంపౌట్ అయ్యాడు. కాసేపటికే క్లాసెన్ కూడా అవుటయ్యాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్, మార్కోయ ాన్సెన్ లు ధాటిగా ఆడటంలో విఫలం అయ్యారు. దాంతో సన్ రైజర్స్ 134 పరుగులకే పరిమితం అయ్యింది.

తుది జట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్ 
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, మార్కో యాన్సెన్, మయాంక్ మార్ఖండే, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్

ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్

అబ్దుల్ సమద్, శాన్వీర్, ఫిలిప్స్, దగర్, నటరాజన్
చెన్నై సూపర్ కింగ్స్  రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే, రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), తుషార్ దేశ్ పాండే, పతిరణ, తీక్షణ, ఆకాశ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్  అంబటి రాయుడు, ప్రిటోరియస్, సేనాపతి, షేక్ రషీద్, హంగార్గెకర్


IN ENGLISH TRANSLATION

CSK vs SRH Live Scores : Sunrisers Hyderabad (Sunrisers Hyderabad) batting has once again won hands. As part of the Indian Premier League 2023 (IPL 2023), Hyderabad batters failed miserably in the ongoing battle against Chennai Super Kings at Chepauk. 

Sunrisers Hyderabad, who batted first, fell into the trap of Chennai Super Kings spinners. So they made only 134 runs for 7 wickets in 20 overs. Ravindra Jadeja was fired up with three wickets. Thikshan, Akash Singh and Pathirana took one wicket each. Abhishek Sharma (34 off 26 balls; 3 fours, 1 six) was the top scorer for Sunrisers. Rahul Tripathi (21 off 21 balls; 1 four, 1 six) looked out of sorts.

Dhoni won the toss and invited Hyderabad to bat. Brook (18) for the first wicket, Abhishek Sharma added 35 runs for the first wicket. After that, Brooke reached the pavilion. 

After that Rahul Tripathi and Abhishek Sharma came to the crease and Sunrisers reached 71 runs without losing another wicket. But from here the entire match changed. 

Jadeja, who came to the bowling, dismissed Abhishek Sharma and Rahul Tripathi. Markrum gave a catch to the keeper in sharp bowling and got out. Mayank Agarwal, who tried to play Jadeja’s bowling, was stumped. After a while, Klassen also left. In the end, Washington Sundar and Markoyan Ansen failed to play hard. With that, Sunrisers were limited to 134 runs.

Final teams

Sunrisers Hyderabad – Mayank Agarwal, Harry Brook, Rahul Tripathi, Aiden Markrum (captain), Heinrich Klaasen, Abhishek Sharma, Marco Janssen, Mayank Markhande, Washington Sundar, Bhuvneshwar Kumar, Umran Malik

Impact Players List

Abdul Samad, Sanveer, Phillips, Dagar, Natarajan
Chennai Super Kings  Rutheraj Gaikwad, Devon Conway, Rahane, Moeen Ali, Shivam Dubey, Ravindra Jadeja, Mahendra Singh Dhoni (captain), Tusshar Desh Pandey, Pathirana, Thikshan, Akash List of Impact Players 
Ambati Rayudu, Pretorius, Senapati, Sheikh Rashid, Hangargekar

GET MORE IPL SPORTS NEWS