How to get health card for retired employees in AP

Spread the love

how to download ehs helth card

How to get health card for retired employees in AP

2024 జనవరి తదుపరి పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు హెల్త్ కార్డు ఎలా పొందాలి తెలుసుకుందాం.

2024 జనవరి నుంచి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పదవి విరమణ చేశారు, పదవీ విరమణ అనంతరం ఆరు నెలల వరకూ విశ్రాంత ఉద్యోగులు హెల్త్ కార్డులు పై వైద్యసేవలు పొందవచ్చు. ఆరు నెలల తరువాత ఆ కార్డులు పని చేయవు.

హెల్త్ కార్డులు పొందడానికి ఏం చేయాలి.

పదవీ విరమణ తదుపరి ఆరు నెలల తర్వాత కానీ లేదా ఆరు నెలలు ముందుగ హెల్త్ కార్డు పొందాలనుకుంటే, ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ వారికి ap _ ehs drntrvaidyaseva.ap.gov.in mail ద్వారా ఉద్యోగిగా ఉన్న హెల్త్ కార్డును
డి ఆక్టివేట్ చేయమని కోరాలి. దరఖాస్తు తో పాటు పిపిఓ, ఆధార్ కార్డ్ మరియు పేస్లిప్ ను కూడా స్కాన్ చేసి మెయిల్ పెట్టాలి.

తదుపరి ఎన్టీఆర్ ట్రస్ట్ వారు రెండు నుంచి నాలుగు రోజుల్లో ఉద్యోగిగా డి ఆక్టివేట్ చేసి పాస్వర్డ్ పంపిస్తారు, ఈ పాస్వర్డ్ తో మరియు సిఎఫ్ఎం ఎస్ ఐ డి తో ఈహెచ్ఎస్ లో లాగిన్ అవి కొత్త పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి.

మనం ఏంచేయాలి?
ఎలా దరఖాస్తు చేయాలి.?

2024 తరువాత పదవి విరమణ చేసిన (2024 తర్వాత/ముందు పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు కొంతమందికి అవగాహన ఉంటుంది ,వారు సొంతంగా చేసుకోవచ్చు లేదా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం, కర్నూలు జిల్లా శాఖా. C/C-3 అధ్వర్యంలో (6300272506) అయినా మార్చుకోవచ్చును.

ఈ అడ్రస్ నందు చేయబడుతున్న సర్వీసెస్ లు :

> ప్రతి నెల పే స్లిప్ లు ఇవ్వబడును.

> మెడికల్ రియంబర్స్ మెంట్ బిల్స్ చేయబడును. >

> ప్రతి సంవత్సరము లైఫ్ సర్టిఫికేట్ లు చేయబడును / డోర్ సర్వీస్ చేయబడును.

> కొత్త పాన్ కార్డ్ లు చేయబడును మరియు పాన్ కార్డ్ లో తప్పులు ఏమైనా ఉంటె కూడా సరిచేయబడును. >పెన్షనర్స్ ఐడేంటి కార్డ్స్ చేయబడును.

> ప్రధాన మంత్రి జెన్ ఆరోగ్య యోజన / ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు / PMJAY ( 5 లక్షల రూపాయల విలువగల హెల్త్ కార్డ్స్) చేయబడును.

> ఈ కార్డును రేషన్ కార్డ్ కలిగిన వారు కూడా తీసుకోవచ్చును.

> కొత్త హెల్త్ కార్డ్స్ చేసి ఇవ్వబడును.

> ఉద్యోగిగా నుండి పెన్షనర్స్ గా మార్పు చేయబడును.

2024 నుండి పదవీ విరమణ చేస్తున్న వారికి CFMS నెంబరే యుజర్ ఐ డి గా ఉంటుంది.

ముందుగా
1.AG ఆఫీసు నుండి వచ్చిన మన PPO స్కాన్ చేసి సేవ్ చేయాలి.

2.పాస్పోర్ట్ సైజ్ ఫొటో స్కాన్ చేసి సేవ్ చేయాలి.

    3. ఆధార్ కార్డు స్కాన్ చేసి సేవ్ చేయాలి. డిపెండెంట్స్ (Spouse ,Children, Parents) ఆధార్ , పాస్పోర్ట్ సైజ్ పొటోలు స్కాన్ చేసి సేవ్ చేయాలి

    4. దరఖాస్తుదారు, డిపెండెంట్సు యెక్క బ్లడ్ గ్రూప్ నోట్ చేసుకొని ఉంచుకోవాలి.

    మనం http://www.ehs.ap.gov.in
    సైట్ ఓపన్ చేసి User name దగ్గర CFMS ID నెంబరు ముందు “P” పెట్టి ఎంటర్ చేయండి. (ఉదాహరణకు మన CFMS ID 14070258 అయితే మన user id – P12345678) Password దగ్గర మీ Cfms ఐడి ఎంటర్ చేసి Login type వద్ద pensioner సెలక్ట్ చేసి, అక్కడ ఇవ్వ బడిన కేప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చెయ్యాలి.

    ఓపన్ అయిన విండో లో ఎడమవైపున Registrations పై క్లిక్ చేస్తే వచ్చే options లో Initiate Health Card/ View Application పై క్లిక్ చేస్తే వచ్చిన విండోలో Aadhar number select చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Retrieve Details పై క్లిక్ చేయగానే

    Application for Pensioner కార్డు అనే దరఖాస్తు వస్తుంది.
    Login name , Aadhar number display అవతాయి.

    ఆ అప్లికేషన్ లోని వివరాలన్నీ పూర్తి చేయండి * మార్క్ ఉన్నవి ఖచ్చితంగా పూరించాలి.

    Personal details లో
    Retirement type , Name , Date of Birth, Gender , Blood Group , marital status, Date of retirement, Community, Disabled వివరాలు పూర్తి చేయాలి.

    Address details పూర్తి చేయాలి.

    Identification మర్క్స్ పూర్తి చేయాలి.

    Last Posting details అక్కడ ఉన్న సెలక్ట్ ఆప్షన్ ద్వారా సరయిన వివరాలు ఎంపిక చేయాలి.

    తరువాత Pension office details select ఆప్షన్ ద్వారా కరెక్ట్ గా ఎంపిక చేసుకొని క్రింద నివ్వబడిన Save Option పై click చేసి సేవ్ చేయండి.

    సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తరువాత ఇప్పటివరకూ పూర్తిచేసిన వివరాలన్నీ సేవ్ అయి క్రింద
    Family members detail option వస్తుంది . అక్కడ Add beneficiary button పై క్లిక్ చేస్తే మరొక విండో ఓపన్ అవుతుంది.
    అక్కడ Spouse Date of Birth ఎంటర్ చేసి Submit button పై క్లిక్ చేయండి.

    అక్కడ Display అయిన విండోలో Spouse Aadhar number enter చేస్తే dependent వివరాలు వస్తాయి.

    అవి పూర్తి చేసి అక్కడే వారి ఆధార్ కార్డు, పొటో కూడా స్కేన్ కాపీ brouse చేసి అప్లోడ్ చేసి సేవ్ చేయాలి.

    ఈ విధంగా ఎంతమంది డిపెండెంట్సు ఉంటే అంతమంది వివరాలను యాడ్ చేసి సేవ్ చేయాలి.

    మెయిన్ అప్లికేషన్ పేజీలో కూడా ఎప్పటికపుడు పూరించిన అంశాలను సేవ్ బటన్ క్లిక్ చేసి సేవ్ చేయండి.

    అనంతరం క్రింద ఇవ్వబడ్డ *Add Attachments button క్లిక్ చేస్తే ఓ విండో ఓపన్ అవుతుంది
    అందులో
    Signed Application Form, Aadhar , Date of Birth ,Photo, PPO/Service register detals స్కేన్ కాపీలు ఒక్కోక్కటిగా Signed Application Form తప్ప మిగిలినవి upload చేయాలి. Upload చేసే స్కేన్ ఒక్కొక్క కాపీ సైజ్ 200 kb కి మించరాదు.

    Signed Application Form తప్ప మిగిలినవి అప్ లోడ్ చేసి సేవ్ చేసిన అనంతరం మెయిన్ పేజీలో Print Application button పై క్లిక్ చేస్తే మనం పూర్తిచేసిన Pensioner Health Card application మన పొటోతో Display అవుతుంది.

    Leave a Comment