EPFO HIGHER PENSION – Latest 2023

Spread the love

EPFO HIGHER PENSION

EPFO HIGHER PENSION APPLICATION FORM

EPFO HIGHER PENSION USES AND DETAILS : అధిక పెన్షన్‌ పొందేందుకు ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి ?

IN ENGLISH : EPFO HIGHER PENSION : Who is eligible for higher pension ? How to apply ?

Ans : సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అధిక పెన్షన్‌కు ఆప్ట్‌ చేసుకునే మార్గాదర్శకాలను ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈ.పీ.ఎఫ్‌.ఓ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. వేతన జీవులకు ఈ అంశంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్న నేపథ్యంలో వివరణలివి.

IN ENGLISH : It is known that the Employees Provident Fund Organization (EPFO) has released the guidelines for opting for higher pension as per the verdict of the Supreme Court. This is explained in the background of many doubts arising on this topic for the salaried employees.

ప్రస్తుత పెన్షన్‌ విధానం

వాస్తవానికి ఈపీఎఫ్‌ చట్టం 1952 ప్రకారం పెన్షన్‌ ఇచ్చే స్కీము ఏదీ లేదు. చట్ట సవరణల తర్వాత 1995 నుంచి ఈపీఎఫ్‌ఓ నేతృత్వంలో ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ అమల్లోకి వచ్చింది. దీని కింద ప్రావిడెంట్‌ ఫండ్‌ (పిఎఫ్‌) కోసం యాజమాన్యాలు జమచేసే డిపాజిట్‌లో 8.33 శాతం పెన్షన్‌ నిధికి మళ్లిస్తున్నారు. ఉద్యోగి వేతనం (బేసిక్‌+ డీఏ)లో 12 శాతం చొప్పున ఉద్యోగులు, యాజమాన్యాలు ఈపీఎఫ్‌కు చెల్లిస్తుండగా, ఉద్యోగి వాటా మొత్తం అంతా పీఎఫ్‌ ఖాతాలోకి వెళుతుంది. యాజమాని చెల్లించిన 12 శాతంలో 3.67 శాతం ఈపీఎఫ్‌కు, 8.33 శాతం ఈపీఎస్‌కు మళ్లిస్తున్నారు. దీనికి తోడు ఉద్యోగి పెన్షన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం 1.16 శాతం ఇస్తుంది. ఈపీఎస్‌ ప్రవేశపెట్టినపుడు గరిష్ఠ పెన్షన్‌బుల్‌ వేతనాన్ని నెలకు రూ. 5,000గా నిర్దేశించారు. తర్వాత దానిని రూ.6,500కు పెంచారు. 2014 సెప్టెంబర్‌ 1 నుంచి దీనిని రూ. 15,000 చేశారు. అంటే ఈ వేతనంపై పెన్షన్‌ నిధికి వెళ్లేది రూ.1,250 (8.33 శాతం). పెన్షన్‌బుల్‌ వేతనాన్ని మించి వాస్తవ బేసిక్‌ వేతనంపై ఈపీఎఫ్‌కు చెల్లించే ఆప్షన్‌ను ఉద్యోగి, యాజమాని కలిపి తీసుకునే సౌలభ్యం ఉంది.

This is the current pension scheme

Actually there is no pension scheme under the EPF Act 1952. The Employees Pension Scheme led by EPFO ​​came into force in 1995 after the amendments in the Act. Under this, 8.33 percent of the deposit made by the employers for the Provident Fund (PF) is diverted to the pension fund. While employees and employers pay 12 percent of the employee’s salary (basic + DA) to the EPF, the entire share of the employee goes into the PF account. Of the 12 percent paid by the employer, 3.67 percent is diverted to EPF and 8.33 percent to EPS. In addition to this, the central government gives 1.16 percent for employee pension. When EPS was introduced, the maximum pensionable salary per month was Rs. 5,000 has been specified. Later it was increased to Rs.6,500. From September 1, 2014 it will be Rs. 15,000 was made. That means Rs.1,250 (8.33 percent) goes to the pension fund on this salary. The option of paying EPF on the actual basic salary in excess of the pensionable salary is available to both the employee and the employer.

ఇప్పుడు పెన్షన్‌ ఎవరికొస్తున్నది, ఎంత?

కనీసం పదేండ్ల సర్వీసు ఉండి, 58 ఏండ్ల వయస్సు తర్వాత ఈపీఎస్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఇస్తున్నది. 50-57 సంవత్సరాల మధ్య ఉద్యోగాన్ని వదిలిపెట్టినవారు ముందు నుంచే పెన్షన్‌ కోరవచ్చు. కానీ అది తక్కువ ఉంటుంది. నెలవారీ పెన్షన్‌ లెక్కించే ఫార్ములా:నెలవారీ పెన్షన్‌=పెన్షన్‌బుల్‌ సేలరీXపెన్షన్‌బుల్‌ సర్వీసు/70. 2014 సవరణల ప్రకారం ఉద్యోగం నుంచి వైదొలిగేముందు 60 నెలల సగటు వేతనాన్ని పెన్షన్‌బుల్‌గా లెక్కిస్తారు.

Now who is getting pension and how much?

Pension is given to EPS employees after the age of 58 years with at least 10 years of service. Those who leave the job between 50-57 years can claim pension early. But it will be less. The formula for calculating monthly pension is: Monthly Pension=Pensionable SalaryXPensionable Service/70. According to the 2014 amendments, 60 months average salary before leaving the job is considered as pensionable.

2014లో జరిగిన సవరణలేంటి?

పెన్షన్‌బుల్‌ సేలరీ పరిమితిని రూ.6,500 నుంచి రూ. 15,000కు పెంచడంతో పాటు.. ఈ పరిమితికి మించి కూడా యాజమాన్యాలతో కలిసి ఉద్యోగులు వారి వాస్తవ వేతనాల్లో 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు చెల్లించడాన్ని అనుమతించారు. ఈ సవరించిన స్కీమ్‌కు ఆప్ట్‌ చేసుకునేందుకు 2014 సెప్టెంబర్‌ 1న ఈపీఎస్‌ సభ్యులందరికీ ఆరు నెలల గడువు ఇచ్చారు. ప్రాంతీయ ప్రావిడెంట్‌ కమిషనర్‌ మరో 6 నెలల గడువును పొడిగించేందుకు అనుమతించారు. వాస్తవ జీతంపై పెన్షన్‌ కోసం ఆప్ట్‌ చేసుకునే సభ్యులు పెన్షన్‌ ఫండ్‌కు అదనంగా వారి జీతం నుంచి 1.16 శాతం చెల్లించాలని నిర్దేశించారు. గడువులోపు వాస్తవ జీతంపై పెన్షన్‌ను ఆప్ట్‌ చేయనివారికి…అప్పటికే పెన్షన్‌ ఫండ్‌కు అదనంగా చెల్లించిన మొత్తాన్ని ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాకు బదిలీ చేశారు.

What are the amendments in 2014 ?

The pensionable salary limit has been raised from Rs.6,500 to Rs. 15,000 and beyond this limit, employees along with employers are allowed to contribute 8.33 per cent of their actual wages towards EPS. Members opting for pension on actual salary are directed to pay an additional 1.16 percent of their salary to the pension fund. For those who do not opt ​​for pension on actual salary within the due date…the amount already paid in addition to the pension fund is transferred to the provident fund account.

అధిక పెన్షన్‌ కోసం డిపాజిట్‌ చేయాలా ?

ఉద్యోగి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో అధికంగా జమచేసి ఉన్న/బదిలీ చేసిన మొత్తాన్ని పెన్షన్‌ ఖాతాలోకి మళ్లిస్తారు. ఉద్యోగి ఇంతకు ముందే పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకుని, అధిక పెన్షన్‌కు ఆప్ట్‌ చేస్తే, నిర్దేశిత మొత్తాన్ని పెన్షన్‌ ఖాతాలో డిపాజిట్‌ చేయమంటూ ఉద్యోగిని ఈపీఎఫ్‌ఓ కోరుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Deposit for higher pension ?

The excess deposited/transferred amount in the provident fund account of the employee is transferred to the pension account. If the employee withdraws the PF earlier and opts for higher pension, EPFO ​​asks the employee to deposit the specified amount in the pension account. The full details of this are yet to be revealed.

అధిక పెన్షన్‌పై తలెత్తే ప్రశ్నలు , సమాధానాలు

  • సెప్టెంబర్‌ 1, 2014కు ముందు రిటైర్‌ ఈ తేదీ ముందు రిటైర్‌ అయినవారు సర్వీసులో ఉన్నపుడు అధిక పెన్షన్‌ను అయితే ఇప్పుడు అధిక పెన్షన్‌ కోరవచ్చా?
  • Ans : ఈ తేదీ ముందు రిటైర్‌ అయినవారు సర్వీసులో ఉన్నప్పుడు అధిక పెన్షన్‌ను  ఆప్ట్‌ చేసి, దానిని ఈపీఎఫ్‌ఓ తిరస్కరించిఉంటే ఇప్పుడు కోరవచ్చు
  • సెప్టెంబర్‌ 1, 2014నాడు, అటుతర్వాత రిటైర్‌ అయితే అధిక పెన్షన్‌ను అర్హులేనా?
  • Ans: వీరు ఈపీఎఫ్‌ ఖాతాకు వాస్తవ జీతంపై చెల్లింపులు చేసి కూడా 2014 సెప్టెంబర్‌ 1కి ముందు అధిక పెన్షన్‌కు అప్ట్‌ చేసి ఉండకపోతే, ఇప్పుడు చేయవచ్చు.
  • ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు ఆప్ట్‌ చేసుకోవచ్చా?
  • Ans : 2014 సెప్టెంబర్‌ 1కి ముందు ఉద్యోగంలో చేరి, ప్రస్తుతం కూడా వాస్తవ వేతనంపై ఈపీఎఫ్‌కు చెల్లింపులు చేస్తూ ఆ తేదీకి ముందు అధిక పెన్షన్‌కు ఆప్ట్‌ చేయకపోతే, ఇప్పుడు చేయవచ్చు.
  • సెప్టెంబర్‌ 1, 2014 తర్వాత సర్వీసులో చేరినవారు ఇప్పుడు ఆప్ట్‌ చేయవచ్చా?
  • Ans : ఆప్ట్‌ చేసే అర్హత లేదు
  • ఈపీఎఫ్‌ చట్టంలో పేరా 26(6) అంటే?
  • Ans : సభ్యుడు చట్టబద్ద పరిమితికంటే ఈపీఎఫ్‌కు ఎక్కువ చెల్లించే ప్రొవిజన్‌ను ఈ పేరా కల్పిస్తుంది. ఇందుకోసం సభ్యుడు, యజమాన్యం ఉమ్మడిగా రాతపూర్వకంగా దరఖాస్తు సమర్పించాలి. దీనిని ఏపీఎఫ్‌సీ ర్యాంక్‌కు తక్కువకాని అధికారి ఆమోదించాలి.
  • ఇప్పుడు ఎక్కువ పెన్షన్‌ను కోరాలంటే పేరా 26(6) కింద ఆప్ట్‌ చేయడం తప్పనిసరా?
  • Ans : అవును. పేరా (26)6 కింద చట్టబద్ద పరిమితిని మించిన వాస్తవ జీతంపై ఈపీఎఫ్‌కు చెల్లింపులు చేస్తున్న తేదీని ప్రస్తావిస్తూ అధిక పెన్షన్‌ కోసం ఆప్ట్‌ చేయవచ్చు.
  • ఇంతకూ ఎవరు ఇప్పుడు అధిక పెన్షన్‌కు ఆప్ట్‌ చేయవచ్చు?
  • Ans : (ఏ) 2014 సెప్టెంబర్‌ 1కి ముందు సర్వీసు నుంచి వైదొలిగి, ఉద్యోగంలో ఉన్నపుడు అధిక పెన్షన్‌కు ఆప్ట్‌ చేసి, ఈపీఎఫ్‌వో ద్వారా తిరస్కరణకు గురైన వారు.
  • (బీ) 2014 సెప్టెంబర్‌ 1న లేదా ఆ తర్వాత సర్వీసులో ఉండి, వాస్తవ జీతంపై ఈపీఎఫ్‌కు చెల్లింపులు జరుపుతూ, అధిక పెన్షన్‌కు ఆప్ట్‌ చేయనివారు.
  • అధిక పెన్షన్‌ ఆప్షన్‌ను అర్హులు కానివారు ఎవరు?
  • Ans : ఏ) ఎటువంటి ఆప్షన్‌ ఎంపికచేయకుండా 2014 సెప్టెంబర్‌ 1కి ముందు సర్వీసు నుంచి వైదొలిగినవారు.
  • (బీ) చట్టబద్ద వేతన పరిమితిపైనే ఈపీఎఫ్‌కు చెల్లింపులు చేస్తున్న వారు.
  • (సీ) 2014 సెప్టెంబర్‌ 1 తర్వాత సర్వీసులో చేరినవారు.
  • పెన్షన్‌ ఎంతకాలం వస్తుంది?
  • Ans : ఈపీఎఫ్‌వో సభ్యుడి జీవితాంతం పెన్షన్‌ అందుతుంది. మరణాంతరం ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వస్తుంది.
  • 2014లో ఈపీఎఫ్‌వోకు చెల్లింపులు చేయకపోతే అధిక పెన్షన్‌ను ఎంచుకోవచ్చా?
  • Ans : 2014 సెప్టెంబర్‌ 1నాటికి ఈపీఎస్‌ సభ్యత్వం నుంచి వైదొలగకుండా,2014లో చెల్లింపులు చేయకపోయినా అధిక పెన్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

GET LATEST UPDATE NEWS