Ugadi festival in Telugu

Spread the love

Ugadi Festival

Ugadi festival in Telugu

ఉగాది విశిష్టత

ఉగాది విశిష్టత చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి.

UGADI FESTIVAL

చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది.

UGADI FESTIVAL

ఉగాది‘, ‘యుగాది‘ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.

తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ‘విషు’ అనే పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత

ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.

UGADI FESTIVAL

బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు

శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఉగాదినాడేనని చెబుతారు. ఉగాది నాడు వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేశారని చెబుతారు. ఇక ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగకు వివిధ పేర్లు ఎందుకు వచ్చాయి అన్న దానికి కూడా చాలామంది పండితులు రకరకాలుగా చెబుతూ ఉంటారు. కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారని చెబుతారు.

UGADI FESTIVAL

కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయని మరి కొంతమంది దక్ష ప్రజాపతి కుమార్తెలకు 60 పేర్లు ఉన్నాయని ఆ పేర్లు ఇవి అని చెబుతారు. ఇక ఇంకొంతమంది కృష్ణుడికి ఉన్న భార్యలలో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం ఉన్నారని వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు. ఇలా ఎవరికి తోచింది వారు ఉగాది అని పేరు రావడానికి వెనుక ఉన్న కారణాలను చెబుతూ ఉంటారు.

వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమినాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పారు. ఈరోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని బలంగా విశ్వసిస్తారు. ప్రభవ నామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది.

ఇప్పటివరకు ఆరుగురు బ్రాహ్మలు బ్రహ్మ కల్పం పూర్తి చేశారు. ప్రస్తుతం ఏడో బ్రహ్మ బ్రహ్మ కల్పం కొనసాగిస్తున్నారు. శ్రీమహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఇదే అని చెబుతారు.

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది రోజున ఆచరణ విధి

  1. సూర్యోదయం కన్నాముందే లేచి అభ్యంగన స్నానం ఆచరించాలి.
  2. సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి.
  3. ఇంటిపైన కాషాయ ధ్వజం ఎగురవేయాలి.
  4. నిత్య నైమిత్తిక కర్మలన్నీ ముగించుకోవాలి.
  5. ఇష్ట దేవతలను పూజించుకోవాలి
  6. పంచాంగంను పూజించి ఉగాది పచ్చడి నివేదన చేయాలి.

ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం

శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్‌

UGADI FESTIVAL

చైత్రశుద్ధ పాడ్యమి రోజునే సృష్టి మొదలైందని పెద్దలు చెబుతారు. అందుకనే ఆ రోజుని యుగాది లేక ఉగాదిగా గుర్తిస్తారు. ప్రతి పండుగలానే ఇవాళ కూడా సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయమని చెబుతారు. నువ్వులనూనెని ఒంటికి పట్టించి చేసే స్నానమే ఈ తైలాభ్యంగనం. ఏ రోజు కుదిరినాకుదరకపోయినా సంవత్సరానికి తొలిరోజైన ఉగాదినాడు తైలాభ్యంగనం చేసి తీరాలన్నది పెద్దల శాసనం. సంవత్సరపు ఆరంభాన్ని ఇలా శుచిగా , ఆరోగ్యంగా ప్రారంభించాలన్నది వారి అభిమతం.

అభ్యంగన స్నానం ముగిసిన తరువాత గడపకు పసుపు , కుంకుమలను అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. ఇక ఉగాదిరోజునఏ దైవాన్ని పూజించాలి అన్నది కూడా ఓ సందేహమే ! ఉగాది రోజున కాలమే దైవం. కాబట్టి మనకు ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తల్చుకుని పూజించుకోవాలి. స్థితికారుడైన విష్ణుమూర్తిని స్మరించినా , లయకారుడైన శివుని కొలిచినా , ప్రకృతికి చల్లధనాన్ని అందించే అమ్మవారిని ధ్యానించినా సమ్మతమే !ఇష్టదేవతల స్తోత్రాలని పఠించి పూజించిన తరువాత వారికి ఉగాది పచ్చడిని నివేదించాలి.

పులుపు , తీపి , వగరు , చేదు , ఉప్పు , కారం అనే ఆరురుచుల కలయికగా ఉగాది పచ్చడిని రూపొందిస్తాము. వైద్యపరంగా ఈ ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. ఆధ్మాత్మికంగా చూస్తే జీవితం సుఖదుఖాలమిశ్రమం అని చెప్పడమే ఉద్దేశంగా కనిపిస్తుంది. ఒక పక్క జీవితం శుభాశుభాల మిశ్రమం అని గ్రహిస్తూనే రాబోయే రోజులకి సిద్ధపడాలనే సూచనని అందించేదే పంచాంగం. అందుకనే సంవత్సరపు మొదటిరోజైన ఉగాది నాడు పంచాంగం విని తీరాలంటారు పెద్దలు.

ఇక ఉగాది రోజున ‘ప్రపాదానం’ అంటే చలివేంద్రాన్నిపెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపడమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తున్నారు.

ఎండలని తట్టుకుంటే నీరు ఇస్తే సరిపోదు కదా ! అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకుఉగాదినాడు చెప్పులూ , గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మకుంభదానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెబుతారు.

ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిదీ కాదు కాబట్టి , ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్లమని చెబుతారు. ఉగాది నూతన సంవత్సరానికి సూచన కాబట్టి కొత్త పనులను చేపట్టమని ప్రోత్సహిస్తారు. ఉగాది రోజున చేయవలసిన పనులు ఇన్ని ఉన్నాయన్నమాట.