విజయాన్ని సాదించడానికి ఏముండాలి.?
భూమి పై జీవించే ముక్కోటి జీవరాశులు జీవిస్తున్నాయి. కానీ మనుషులు , జంతువులు, పక్షులు క్రిమి కీటకాలు మొదలైన అనేక జీవరాశులన్ని ఏదైన కావలనుకుంటే దక్కితీరాలి / సాదించాలి తీరాలని తన మనసుకు దృఢముగా చెప్పుకుంటాయి, చెప్పుకుంటారు.
జీవితం లో ప్రాణంతో వున్న ప్రతీ వారు మొదటి ప్రాధన్యత విజయానికే ఇస్తారు. భగవంతున్ని పూజించే సమయము నందు కూడా విజయం కోసమేనని మొదలు పెడతారు.
విజయాన్ని ఎలా పొందాలి.? :
ఆటల్లో కానీ పాటల్లో గానీ మాటల్లో గానీ పనుల లో విజయాన్ని పొందాలంటే ఏమీ నేర్చుకోవాలి , ఏమీ తెలిసుండాలి ,ఏ విధముగా ముందుకు సాగాలి అనీ నిరంతరము విజయం కోసమే ఎదురు చూస్తూ ఉంటాము , పరితపిస్తూ ఉంటాము. అంతే కాదు ఆ సమయం ఎప్పుడు వస్తుంది.? ఎలా వస్తుంది.? కల్లకి ఒత్తులేసుకొని చూస్తుంటాము. కానీ విజయం సాదించాలనుకునే వరికి ఉండవలసినవి ఈ క్రింది విధముగా ఉన్న వాటి గురించి తెలుసుకోండి మిత్రులారా.
1. ఆలోచన (THINK)
2. నిర్ణయం ( DESSISION)
3. ఓపిక ( SILENT )
4. సహనం (PATIENCE)
5. పట్టుదల ( PERSEVERANCE)
6. శ్రమ ( EXERTION Or Hord Work)
7. విజయం ( SUCCESS)
1. ఆలోచన :
ఆలోచన అనేది దేన్నైనా కావలనుకున్నపుడు, ఇంఖెదైనా కోరుకున్నది పొందడం కోసం మొదటగా ఆలోచన చేయటం . అదికావాలా వద్ద , సాదించగలనా లేదా.? అని తెలుసుకోవాలి. ప్రతీది మొండితనం తో లేదా పౌరూషం కోసం , మాట కోసం నీ ఆలోచన చేయకూడదు. నీ కోసం కోసం మాత్రమే ఆలోచించాలి.
2. నిర్ణయం :
ఒకటికి మించి అనేక సార్లు ఆలోచించిన తర్వాత లేదా తెలియక పోతే తెలుసుకున్న తర్వతే గట్టి నిర్ణయం అనేది తీసుకోవడం అంటు సాధారణంగా జరుగుతుంది. ఏది ఏమైన పూర్తిగా స్పష్టము గా కోరుకున్నప్పుడు లేదా తలుచుకున్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
3. ఓపిక :
ఓపిక విషయానికి వస్తే ప్రతీ వ్యక్తిలో ఓపిక ఎప్పుడు ఉంటుందో తెలియదు అంతే కాదు ఓపిక తో ఎప్పుడు ఉంటారో తెలియదు. ఏది దక్కించుకోవాలనుకున్న కూడా ఓపిక చాలా అవసరం అంటుంటారు. కానీ మనము మన పెద్దలు కానీ ఓపిక గురించే చాల చెబుతుంటారు. ఈ ఓపిక అనేది లేకుంటే స్థిర నివాసం కానీ ఒక చోట ఉద్యోగం కానీ , పనిగాని ఎక్కువ కాలం జీవించలేరు.
ఒక్క విషయం లో చెప్పాలాంటే ఓపిక తో మౌనంఎ ఉత్తమం అనుకోవచ్చు. అనేకమైన చోట్ల ఓపిక ఉందో లేదో పరిక్షిస్తుంటారు. ఓపిక తో జీవించే వారి కోసమే కావచ్చు , చదువులో అయినా కావచ్చు , పోటీలో అయినా కావచ్చు. చదువులో అయినా కావచ్చు , పోటిలో అయినా కావచ్చు. ఓపికతో ఉన్నప్పుడే విజయాన్ని త్వరితగతిని పొందవచ్చు.
4. సహనం :
సహనం అంటే ఏంటి.? సహనం అనేది ఆవేశాన్ని చంపేయడం. సహనం అంటే మీకు సరైన అర్థ వంతమైన సమాదానం చెప్పడానికి రాకపోవచ్చు. కానీ దానికిపూర్తి అర్థం చెప్పడానికి రాదు చాలా మందికి. ముఖ్యంగా ఓపిక మరియు సహనం ఈ రెండు చాలా దగ్గర సంబందాలను కలిగి ఉంటాము. అస్సల్కి సహనం ఎక్కడ కనిపిస్తుంది అంటే , ఓపికగా ఉన్నప్పుడు మాత్రమే సహనం కనిపిస్తుంది. యాజమాన్యంతో గాన్ని ఇంటి పెద్దవారితో గాని చిన్నవారితో గానీ ఉద్యోగం కోసంగానీ బరువు అంత తలమీదకి తెచ్చినప్పుడు కానీ , ఎవరన్న అనరాని మాటలు అన్నప్పుడు గానీ ఆ ఒక్క క్షణం గడిస్తే మిగితా రోజులు కూడా బాగుంటాయి అని అనుకున్న చోట ఎదురుగా వాదోపవదనలు చేయకుండా ఆవేశాన్ని చంపుకుంటు సహనంతో ఉండటం.
5. పట్టుదల :
సరైన ఆలోచన తీసుకుని దృఢమైన / గట్టి నిర్ణయం తీసుకొని ఓపికగా ( ఉదా : పులి వేటాడే ముందు ఓపికతో కొంత సమయాన్ని ఓపికతో ఉండటం) ఉంటూ ఆతృత , ఆవేశం , ఒడి దుడుకులు జరగ కుండా ఇప్పుడనే కాదు విజయన్ని సాదించి తీరాలని పట్టు వీడని విధముగా పట్టుదల తో బ్రతుకుని కొనసాగించడం.
6. శ్రమ :
పైన తెలుసుకున్న ఈ 5 విషయాలు ఉన్నప్పుడు శ్రమను కూడా భరించి తీరాలి మిత్రులారా.
విజయాన్ని చేజిక్కించుకోవాలనుకుంటే ఆలోచన , నిర్ణయం , ఓపిక , సహనం , పట్టుదల ఇవ్వి మాత్రమే ఉంటే సరిపోదు. సాదించాలనే తపనా , తాపత్ర్యం ఉంటే సరిపోదు కష్టపడే గుణం కూడా ఎరుగాలి. శ్రమను చూసి పారిపోకూడదు , భయాన్ని వెంట పెట్టుకోకుడదు. అలసిపోయానే అనీ అసంతృప్తితో వెనుకంజ వేయకూడదు. ఎన్ని అవమానాలు , ఎన్ని అడ్డంకులు , ఎన్ని నిందలు వచ్చిన వాటిని తప్పించుకుంటు , ఏ ఒక్కరికి కీడు తలపెట్టకుండా , అన్యాయం చేయకుండా , నష్టాన్ని కలిగించకుండా ముందుకు సాగడం అప్పుడే శ్రమకు తగ్గ ఫలితం అనేది లభిస్తుంది మిత్రమా.
7. విజయం :
ఆలోచన బాగుంటే నిర్ణయం బాగుంటుంది. నిర్ణయం మంచిదైనప్పుడు సాధారణంగా ఓపిక , సహనం , పట్టుదల , శ్రమ ను నమ్ముకుని ముందుకు సాగుతూ పోతూ ఫొతూ ఉండగా ఏదో ఓకనాడు విజయం అనేది నీ చేతికి అందుతుంది మిత్రమా.
గమనిక :(Note)
మిత్రులారా.. ఇది నా అలోచనతో చెప్పియున్నాను. కనుక ఇందులో ఏదైన తప్పుగా ఉందని మీకనిపిస్తే కామేంట్లో తెలియ జేయమని ఆశిస్తున్నాను
Good
Excellent