APSRTC Apprentice Recruitment

Spread the love

APSRTC Apprentice Recruitment

ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. నందు అప్రెంటీస్ చేయుటకు ఆసక్తి కలిగి ఈ క్రింది కనపరిచిన ట్రెడ్ల నందు I.T.I ఉత్తీర్ణులైన వారు 01.11.2023 నుండి 15.11.2023 వ తేదీ లోగా ఆన్ లైన్ వెబ్సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకొనవలసినదిగా తెలియచేయడమైనది. 15.11.2023 వ తెడి తదుపరి తేదీలలో దరఖాస్తు చేసుకొన్న వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో పరిగణ లోకి తీసుకొనబడవు. అభ్యర్థులు క్రింద తెలిపిన సూచనలను చదివి వాటిని తప్పక పాటించవలసినదిగా కొరడమైనది. 1). ఖాళీల సంఖ్య :- కర్నూల్, నంద్యాల , అనంతపురం, శ్రీ సత్యా సాయి , అన్నమయ్య జిల్లా నందు వున్న I.T.I ల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.

FOR LATEST GOVERNMENT JOBS

ఖాళీల సంఖ్య : ట్రెడ్స్ మరియు జిల్లా వారి ఖాళీల వివరములు :-

ట్రేడ్/జిల్లాడీజిల్ మెకానిక్ మోటర్ మెకానిక్ ఎలక్ట్రిసియన్ వెల్డర్పెయింటర్మేషనిష్ట్ ఫిట్టర్ద్రఫ్త్స్ మెన్ సివిల్ మొత్తం
కర్నూల్ 40431100049
నంద్యాల41431100050
అనంతపురం43341100052
శ్రీ సత్యా సాయి 32331100040
కడప47841122267
అన్నమయ్య 42331100151

2) నమోదు చేయు విధానము : I.T.I ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి పూర్తి వివరములను ఆన్ లైన్ వెబ్ సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు నమోదు చేసుకున్న తర్వాత వారు వెబ్ సైట్ నందు లాగిన్ అయ్యి వారు అప్రెంటిసెప్ చేయదలచుకున్న జిల్లా ను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలెను. జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరములు ఈ క్రింద కనపరచబడినది.

SL.NODISTRICTName of the Establishment
1KURNOOLAPSRTC KURNOOL
2NANDYALAPSRTC NANDYAL
3ANANTAPURAPSRTC ANANTAPUR
4SRI SATHYA SAIAPSRTC SRI SATHYA SAI
5KADAPAAPSRTC KADAPA
6ANNAMAYYAAPSRTC ANNAMMAYYA

3). రుసుము : ఏ.పి.యస్.ఆర్.టీ.సీ. నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు ధరఖాస్తు చేసుకోన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల. ఏ.పి.యస్.ఆర్.టీ.సీ. బల్లరి చౌరస్తా, కర్నూల్ నందు హాజరు కావలసియుండును. వెరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ. 118/ ( Rs 100 + 18 GST) రుసుము చెల్లించవలేను. వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రిక ల ద్వారా తెలియజేయబడును.

3) రుసుము :- ఏ.పి. యస్. ఆర్. టీ. సి. నందు అప్రెంటిస్ కొరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల, ఏ.పి. యస్. ఆర్. టి.సి., బళ్లారి చౌరస్తా, కర్నూల్ నందు హాజరు కావలసియుండును. ఎరిఫికేషన్ కు హాజరు అయ్యే అభ్యర్థులు రూ.118/- (Rs.100+18 GST) రుసుము చెల్లించవలెను. వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రిక ల ద్వారా తెలియజేయబడును.

4) సర్టిఫికెట్స్ మరియు నకళ్ళు: ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వెనువెంటనే ఈ క్రింద తెలిపిన సర్టిఫికేట్స్ యొక్క నకలును మా కార్యాలయమునకు 16.11. 2023 తేదీ లోగా చేరునట్లు పంపవలసినదిగా కోరడమైనది. సర్టిఫికేట్స్ ను పంపునప్పుడు తగిన విధముగా పూర్తి చేసిన “Resume” తో పాటుగా పంపవలెను. Resume కాపీ ని అందువెంట జతచేయడమైనది..

పంపవలసిన సర్టిఫికేట్స్ నకళ్ళు:-

i) ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్

ii) www.apprenticeshipindia.gov.in పోర్టల్ నందు Apprenticeship Registration Number (ARN).

iii) SSC మార్కుల జాబితా:

i ) ITI మార్కులు (కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో)

ii) NCVT సర్టిఫికేట్ (తప్పని సారి )

iii) కుల ధృవీకరణ పత్రము SC/ST/BC (పర్మనెంట్ సర్టిఫికేట్ లేనియెడల ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల

iv) వికలాంగులైనచో దృవీకరణ పత్రము

v) మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో దృవీకరణ

vi) NCC మరియు Sports ఉన్నచో సంబంధం దృవీకరణ పత్రములు మరియు

vii) ఆధార్ కార్డు

B) Certificates కళు పంపవలసిన చిరునామా:-

ప్రిన్సిపాల్,

Zonal Staff Training College, APSRTC, Bellary Chowrastha, KURNOOL (PO) & (Dt)

c) ఈ నోటిఫికేషన్ తో పాటు అభ్యర్థి “RESUME ” నమూనా జతచేయడమైనది. అభ్యర్థులు Resume నకలును print తీసుకొని. అందులోని అన్ని వివరములు పొందుపరచవలెను. సర్టిఫికేట్స్ తో పాటు Resume జత చేసి పైన తెలిపిన చిరునామా కు పోస్ట్ ద్వారా పంపవలెను.

D) ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు అభ్యర్థులు పైన తెలిపిన తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు ఒక జత నకలు తీసుకు రావలెను.

ముఖ్య గమనిక :

1) ఆన్ లైన్ నందు 15.11.2023 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్ధులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజ.రు కావలెను. ఆన్ లైన్లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును. వేరే ఏ మాధ్యము ద్వారా సమర్పించినను సీడవు.

2) ఆన్ లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డు ను తప్పనిసరిగా నమోదు చేయవలెను (E-KYC) మరియు ఆధార్ కార్డు లో వున్న వివరములు SSC సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి వివరములతో సరిపోవలెను.

౩) పోర్టల్ నందు అప్రెంటిన్షిప్ కొరకు అప్లై చేయనపుడు ఏమైనా సందేహములు వున్న ఎడల మీరు మీ Govt. 1.T.I కాలేజీ, నందు సంప్రదించవచ్చును.

(4) ఏదైనా సందేహము వున్న ఎడల phone no. : 08518-257025, 7382869399, 7382873146 లకు ఆఫీస్ సమయములో మాత్రమే అనగా ఉ: 10, 30 గంటల నుండి సా: 05.00 గంటల వరకు సంప్రదించవలసినదిగా కోరడమైనది.

5) ఈ ప్రకటన మీకు దగ్గరలోని డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటీసు బోర్డు నందు కూడా చూడవచ్చు.

6). ఈ ప్రకటన APSRTC website www.apsrtc.ap.gov.in నందు కూడా చూడవచ్చు