Loud betting in AP Excitement on candidates’ wins and losses

Spread the love

Loud betting in AP Excitement on candidates’ wins and losses

betting

జోరుగా సాగుతున్న బెట్టింగ్ ల పర్వం.. ఈ నియోజకవర్గాల్లో ఉత్కంఠ

AP: ఏపీలో గెలిచేది ఎవరు? అధికార పీఠం ఎక్కేది ఎవరు.? ఇది తెలియాలంటే ఇంకా పది రోజులు ఆగాల్సిందే. అయితే నువ్వా.. నేనా.. అన్నట్టు సాగిన ఎన్నికలపై ఫలితాల కోసం ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఇది పెద్ద ఎత్తున బెట్టింగులకు తెరతీసింది.

రాజకీయ పార్టీలే కాదు, పార్టీల పెద్దలు.. అభ్యర్థులు.. కూడా పందెం కోళ్ళుగా మారిన పరిస్థితి నెలకొంది. హేమాహేమీలు బరిలో ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలుపోటములపై పందెంల జోరుపై నిఘా ఉందంటున్న పోలీసు యంత్రాంగం ఇప్పటిదాకా బెట్టింగ్ ముఠాల మూలాలను గుర్తించలేకపోయింది.

Click Here for Latest News

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెట్టింగ్ జెట్ స్పీడ్‎ను అందుకుంది. టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు మాజీ సీఎం కిరణ్, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా ఇలా ప్రముఖులు బరిలో ఉన్న చిత్తూరు జిల్లాలో పలు రకాల పందాలు కొనసాగుతున్నాయి.

కుప్పంలో లక్ష ఓట్ల టిడిపి టార్గెట్ నుంచి గెలుపు ఓటములపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగులు నడుస్తున్నాయి. మరోవైపు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి, నగరిలో మంత్రి ఆర్కే రోజాల గెలుపు ఓటములుపైనా మెజారిటీలు లెక్కలేసుకుంటున్న పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున బెట్టింగులకు తెర తీశారు.

ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.? చిత్తూరు జిల్లాలో ఏ పార్టీ పైచెయ్యి సాధిస్తుందన్న పందాలు కూడా నడుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కుప్పం, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, నగరి, శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్ లనే ఎక్కువగా గెలుపోటములపై పందాలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే కాకుండా కుప్పంలో చంద్రబాబు సాధించబోయే మెజారిటీ, ఆయన గెలుపు ఓటమిపైనా పందాలు నడుస్తున్నాయి.

రాజంపేట పార్లమెంటు స్థానంపై కూడా జోరుగా బెట్టింగ్‎లు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి నుంచి మాత్రమే జనసేన బరిలో నిలిచింది. దీంతో గ్లాసు గుర్తు గెలుస్తుందా లేదా అన్న దానిపైన బెట్టింగ్‎లు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుపై వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ రెడ్డి తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుండగా హోరాహోరీ పోరు నడిచింది.

రెండు పార్టీల నేతల్లో విజయంపై ఎవరి ధీమా వారిదిగానే ఉంది. తిరుపతి అసెంబ్లీలో పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలం అంటే తమకు అనుకూలమన్న ధీమా రెండు పార్టీలోనే ఉంది. దీంతో టెంపుల్ సిటీలో బెట్టింగ్ జోరుగానే నడుస్తోంది. ఇక పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు కేసులతో అట్టుడికిన చంద్రగిరిపై బెట్టింగ్ రాయుళ్లకు పెద్ద అంచనాలే ఉన్నాయి. ఉత్కంఠ భరితమైన పోరు చంద్రగిరిలో కనిపిస్తోంది.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి వైసీపీ నుంచి బరిలో నిలవగా, టిడిపి తరఫున పులివర్తి నాని పోటీ లో నిలబడగా హోరాహోరీగా పోలింగ్ కొనసాగింది. చంద్రగిరి ఫలితం జిల్లా అంతట ఆసక్తి కలిగిస్తుండగా చంద్రగిరిలో గెలుపోటములపై జోరుగా బెట్టింగ్లతో నడుస్తోంది.

ఇక నగరి నియోజకవర్గ విషయంలోనూ ఇదే తరహాలో పందాలు కొనసాగుతున్నాయి. మరోసారి గెలిచి రోజా ఇక్కడ హ్యాట్రిక్ కొడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉంటే రోజాకు ఘోర ఓటమి తప్పదని టిడిపి గట్టిగా చెబుతోంది. దీంతో నగరి రిజల్ట్‎పై కూడా బెట్టింగ్‎లు స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. ఇక రాజంపేట పార్లమెంటు స్థానంపై కూడా ఇదే తరహా బెట్టింగ్ వ్యవహారం నడుస్తోంది.

వైసిపి నుంచి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి హ్యాట్రిక్ కోసం పోటీ చేయగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్గెట్‎గా కూటమి నుంచి మాజీ సీఎం కిరణ్ బరిలో దిగారు. బిజెపి నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉండడంతో హోరాహోరీగా పోటీ కొనసాగింది. రాజంపేట పార్లమెంట్ స్థానం గెలుపోటములపై కూడా జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. అయితే బెట్టింగ్‎ల జోరుకు కళ్లెం వేయాల్సిన పోలీసు యంత్రాంగం బెట్టింగ్‎లు, ఇందుకు సంబంధించిన యాప్‎లపై నిఘా పెట్టామని చెబుతోంది. అయితే బెట్టింగ్ మూలాలను, ముఠాలను కట్టడి చేయలేకపోతుందటంతో కోట్లాది రూపాయల బెట్టింగులు కొరసాగుతున్నాయి.

ఇక ఎన్నికల ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న బెట్టింగ్ ముఠాలు ఈవీఎంలపై ఆశలు పెట్టుకున్నాయి. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎదురుచూస్తున్నారు బెట్టింగ్ రాయళ్ళు.