PURI JAGANNATH TEMPLEPURI JAGANNATH TEMPLE
Spread the love

పూరీ జగన్నాథ్‌ నిధి లెక్కింపు

Odisha Government is all set to open the doors of Ratna Bhandaram at Puri Jagannath temple

PURI JAGANNATH TEMPLE

TELUGU

పూరీ జగన్నాథ్‌ నిధి లెక్కింపు : 46ఏళ్ల తర్వాత తెరుచుకోబోతోంది పూరీ జగన్నాథుని రత్నభాండాగారం. ఒడిషా ప్రభుత్వం నియమించిన 16మంది సభ్యుల బృందం.. రహస్య గదిలోకి వెళ్లనుంది. ఈ బృందంతోపాటు స్నేక్‌క్యాచర్స్‌ కూడా వెళ్తారు. దాంతో, పూరీ జగన్నాథ్‌ నిధి లెక్కింపుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారంలోకి వస్తే పూరీ భాండాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. అందుకోసం జస్టిస్‌ విశ్వనాథ్‌ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు రహస్య గదిని తెరవబోతోంది ఒడిషా ప్రభుత్వం. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ భాండాగారాన్ని ఓపెన్‌ చేయనున్నారు అధికారులు.

భాండాగారాన్ని ఓపెన్‌ చేసేందుకు సకల జాగ్రత్తలు చేపట్టింది అధికార యంత్రాంగం. రహస్య గదిలో కింగ్‌ కోబ్రా లాంటి విష సర్పాలు ఉన్నాయనే భయంతో పాములు పట్టేవాళ్లను రెడీ చేశారు. అలాగే, వైద్యసిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. 12వ శతాబ్దంలో పూరీ జగ్ననాథునికి అనేక వజ్ర, రత్నాభరణాలు సమర్పించారు.

ఒడిషాను పాలించిన అనేకమంది రాజులతోపాటు నేపాల్‌ పాలకులు సైతం ఇక్కడి స్వామికి అత్యంత విలువైన వజ్రవైఢూర్యాలు కానుకలుగా ఇచ్చారు. మిగతా రాజులు సైతం యుద్ధాల్లో గెలుచుకున్న ధనరాశులను స్వామికి సమర్పించారు. వీటిన్నింటినీ ఆలయం కింద రహస్య గదుల్లో భద్రపరిచారు.

ఇక, చివరిసారిగా 1978లో ఆడిట్‌ జరిగింది. ఈ లెక్క ప్రకారం 128 కిలోల బరువైన 454 బంగారు ఆభరణాలు.. 221 కిలోలకు పైగా వెండి వస్తువులు ఉన్నట్లు తేల్చారు. ఈ ఆభరణాలన్నీ విలువైన రాళ్లు పొదిగి ఉన్నట్టు నివేదికలో ప్రస్తావించారు. ఆ తర్వాత 1982, 1985లో రహస్య గదులను తెరిచినా ఆభరణాల ఆడిట్‌ మాత్రం చేయలేకపోయారు.

ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈనెల 19వరకు జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపలే ఉంటారు. పైగా శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతుంటాయ్‌. వీటితోపాటు నిర్ణీత వేళల్లో సేవాయత్‌లు చేపడతారు. ఈ సేవలకు అంతరాయం కలుగకుండా ఈ ప్రక్రియ మొత్తం జరగనుంది. అయితే, నిధి లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందనేది పని మొదలయ్యాకే తెలుస్తుంది.

రహస్య గదిలోకి వెళ్లేవాళ్లంతా వారంరోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ నియమ నిష్టలు పాటించారు. వీళ్లందరూ ఇవాళ సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించనున్నారు. మొదట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. రహస్య గదిలోకి వెళ్తారు. లోపలికి వెళ్లాక స్వర్ణకారులు, శాస్త్రవేత్తల పర్యవేక్షణలో లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయనున్నారు.

GET MORE NEWS

ENGLISH

Counting of Puri Jagannath Nidhi: After 46 years, Puri Jagannath’s gem treasury is about to open. A 16-member team appointed by the Odisha government will go into the secret room. Snakecatchers will also go along with this group. With that, there was great excitement all over the country over the counting of the Puri Jagannath fund. BJP has promised to open Puri Bhandagara if it comes to power. A committee headed by Justice Vishwanath has also been appointed for that purpose. The Odisha government is now going to open the secret chamber as per the recommendations of the committee. Officials will open this warehouse after one o’clock in the afternoon.

The authorities have taken all precautions to open the warehouse. Fearing that there are poisonous snakes like King Cobra in the secret room, snake catchers were prepared. Also, the medical staff is also kept ready. In the 12th century Puri offered many jewels and jewels to Jagannath.

Along with many kings who ruled Odisha, the rulers of Nepal also gifted the most valuable Vajravaidhuryas to the lord here. The other kings also presented the money won in the wars to the Lord. All these were kept in secret chambers under the temple.

The last audit was done in 1978. According to this calculation, it was concluded that there are 454 gold ornaments weighing 128 kg and more than 221 kg of silver items. The report mentions that all these ornaments are encrusted with precious stones. After that, in 1982 and 1985, secret rooms were opened but could not audit the jewellery.

Presently the Rath Yatra is going on in Puri. Jagannath, Balabhadra and Subhadra will remain outside the temple till 19th of this month. Moreover, 119 herbal services are regularly performed to Lord Jagannath in Srikshetra. Along with these, sevayats are performed at fixed times. The entire process will be done without any disruption to these services. However, the number of days it will take to calculate the fund will be known only after the work has started.

All those who went into the secret room followed strict rules by eating only vegetarian food for a week. All of them will enter the temple in traditional attire today. First they perform special pooja to Lord Jagannath.. and go into the secret room. After going inside, counting is done under the supervision of goldsmiths and scientists. The entire process will be videographed.

IN HINDI

पुरी जगन्‍नाथ निधि की गिनती: 46 साल बाद पुरी जगन्‍नाथ का रत्‍न खजाना खुलने जा रहा है। ओडिशा सरकार द्वारा नियुक्त 16 सदस्यीय टीम गुप्त कक्ष में जाएगी. इस ग्रुप के साथ सांप पकड़ने वाले भी जाएंगे. इसके साथ ही पुरी जगन्नाथ निधि की गिनती को लेकर पूरे देश में जबरदस्त उत्साह था. बीजेपी ने सत्ता में आने पर पुरी भंडारागार खोलने का वादा किया है। इस उद्देश्य के लिए न्यायमूर्ति विश्वनाथ की अध्यक्षता में एक समिति भी नियुक्त की गई है। समिति की सिफारिशों के अनुरूप ओडिशा सरकार अब गुप्त कक्ष खोलने जा रही है। दोपहर एक बजे के बाद अधिकारी इस गोदाम को खोलेंगे.

अधिकारियों ने गोदाम खोलने के लिए सभी सावधानियां बरती हैं. गुप्त कक्ष में किंग कोबरा जैसे जहरीले सांप होने की आशंका से सांप पकड़ने वालों को तैयार किया गया। साथ ही मेडिकल स्टाफ को भी तैयार रखा गया है. 12वीं शताब्दी में पुरी ने जगन्नाथ को अनेक रत्न और रत्न अर्पित किये।

ओडिशा पर शासन करने वाले कई राजाओं के साथ-साथ नेपाल के शासकों ने भी यहां के भगवान को सबसे मूल्यवान वज्रवैधूर्य उपहार में दिए थे। अन्य राजाओं ने भी युद्धों में जीता हुआ धन भगवान को अर्पित कर दिया। इन सभी को मंदिर के नीचे गुप्त कक्षों में रखा गया था।

अंतिम ऑडिट 1978 में किया गया था। इस गणना के अनुसार, यह निष्कर्ष निकाला गया कि 128 किलोग्राम वजन के 454 सोने के आभूषण और 221 किलोग्राम से अधिक चांदी की वस्तुएं हैं। रिपोर्ट में बताया गया है कि ये सभी आभूषण कीमती पत्थरों से जड़े हुए हैं। उसके बाद 1982 और 1985 में गुप्त कमरे खोले गए लेकिन आभूषणों का ऑडिट नहीं हो सका.

फिलहाल पुरी में रथ यात्रा चल रही है. इस महीने की 19 तारीख तक जगन्नाथ, बलभद्र और सुभद्रा मंदिर के बाहर रहेंगे. इसके अलावा, श्रीक्षेत्र में भगवान जगन्नाथ को नियमित रूप से 119 हर्बल सेवाएं दी जाती हैं। इनके साथ ही निश्चित समय पर सेवायत भी की जाती है। पूरी प्रक्रिया इन सेवाओं में बिना किसी व्यवधान के पूरी की जाएगी। हालांकि, फंड की गणना करने में कितने दिन लगेंगे यह काम शुरू होने के बाद ही पता चलेगा।

गुप्त कक्ष में जाने वाले सभी लोगों ने एक सप्ताह तक केवल शाकाहारी भोजन खाकर सख्त नियमों का पालन किया। ये सभी आज पारंपरिक पोशाक में मंदिर में प्रवेश करेंगे. सबसे पहले वे भगवान जगन्नाथ की विशेष पूजा करते हैं.. और गुप्त कक्ष में चले जाते हैं। अंदर जाने के बाद सुनारों और वैज्ञानिकों की देखरेख में गिनती की जाती है। पूरी प्रक्रिया की वीडियोग्राफी की जाएगी.

Note: Translated from Telugu, we apologize for any mistakes in language., Our staff is not responsible for any errors in translation