Spread the love

VILLAGE Grate? City Grate ?

పల్లె గొప్పదా ? పట్నం గొప్పదా ? , పల్లెటూళ్ళు ప్రశాంత జీవితం , అమరావతి విశ్లేషణ

నాటి – నేటి అమరావతిని విశ్లేషించండి

నాటి అమరావతి : ఒకటవ శతాబ్ది నాటికే అమరావతి మహా నగరంగా విరాజిల్లేది . అమరావతి నగరానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది . మెగస్తనీసు తన ఇండికా గ్రంథంలో అమరావతిని గుర్తించి రాశాడు . అశోకుడికి పూర్వమే అమరావతిలో బౌద్ధస్తూపం ఉండేదని తెలుస్తోంది . శాతవాహన రాజులు అమరావతిని రాజధానిగా చేసుకొని క్రీ.పూ. 220 వరకు పరిపాలించారు . తరువాత ఇక్ష్వాకులు , పల్లవులు , చాళుక్యులు , విష్ణుకుండినులు దీనిని పాలించారు . తరువాత కోట బేతరాజు వంశస్థులు పాలించారు . 1798 లో అమరావతిని గొప్ప రాజధానిగా జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తీర్చిదిద్దాడు .

నేటి అమరావతి : ఇప్పుడు అమరావతి నగరం ఐదుకోట్ల ప్రజలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అయ్యింది . ఈ రాజధానికి 22.10.2015 న మన ప్రధాని శంకుస్థాపన చేశారు . మొత్తం మూడు దశల్లో ఈ రాజధాని 35 సంవత్సరాలలో సంపూర్ణ అమరావతి నగరంగా రూపొందుతుంది . అమరావతికి రైలు , రోడ్డు సదుపాయాలు ఏర్పాటు అవుతాయి . సింగపూర్ , జపాన్ దేశాల భాగస్వామ్యంలో ఇక్కడ ఆకాశహర్మ్యాలు , ఉద్యానవనాలు , సరస్సులు , రహదారులతో నవ నగరాలు నిర్మితం అవుతాయి . అమరావతి నగరం , అత్యాధునిక హంగులతో ప్రజా రాజధానిగా అభివృద్ధి అవుతుంది . 2016 జూలై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఇక్కడి నుండే సాగుతుంది .

పల్లె గొప్పదా ? పట్నం గొప్పదా ? మీరైతే దేన్ని సమర్థిస్తూ మాట్లాడతారు ? ఎందుకు ?

పల్లె , పట్టణం అనే వాటిలో దేనికదే గొప్ప . పల్లెల్లో ఉండే సదుపాయాలు కొన్ని పట్టణాల్లో దొరకవు . పట్టణాల్లో లభ్యమయ్యే సదుపాయాలు కొన్ని పల్లెల్లో దొరకవు . పట్టణాల్లో విద్యా , వైద్య సదుపాయాలు , ఉద్యోగ సదుపాయాలు ఉంటాయి . చేతివృత్తి వారలకు సహితం పట్టణాల్లో ఉపాధి లభిస్తుంది . పట్టణాల్లో వినోదానికి సినీమాలు , పార్కులు ఉంటాయి . అన్ని రకాల వస్తువులు , పండ్లు , మందులు , అక్కడ దొరుకుతాయి . కాని పట్టణాల్లో నివాసానికి విశాలమైన ఇండ్లు దొరకవు . ఇక్కడ ఇండ్ల అద్దెలు ఎక్కువ . రోడ్లపై జనసమ్మర్ధం ఎక్కువ . మురికివాడలు ఎక్కువ . దానితో కొత్తరకం జబ్బులు వస్తూ ఉంటాయి . పేద , మధ్య తరగతి వారికి వచ్చే ఆదాయంతో అక్కడ వారి కోర్కెలు తీరవు . రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి . అందువల్ల పట్టణాలు గొప్పవి కావు అనిపిస్తుంది .. పల్లెల్లో చక్కని గాలి , పాడిపంటలు , మంచినీరు లభిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . విశాలమైన ఇళ్ళు ఉంటాయి . కాని పల్లెలో మంచిరోడ్లు , విద్యా , వైద్య సదుపాయాలు , ఉద్యోగావకాశాలు లేవు . అందువల్ల పల్లెల కన్నా పట్టణాలు బాగుంటాయి అనిపిస్తుంది . నిజానికి పల్లెలోనూ , పట్టణాలలోను సమస్యలు ఉన్నాయి . లేని సదుపాయాలను పల్లెవాసులకు కల్పిస్తే పల్లెలు కూడా పట్టణాలవలె బాగుపడతాయి .

శా ॥ ” అ – యేమీ ? యొక రాణివాసమును బుణ్యావాసమున్ దెచ్చినా

వా ? యే హైందవుఁడైన నీ గతి నమర్యాదన్ బ్రవర్తించునే ?

మా యాజ్ఞన్ గమనింపవో ? జయ మదోన్మాదంబునన్ రేఁగి , నీ

యాయుస్సూత్రము లీవ త్రుంచుకొనెదో ? యౌద్ధత్య మోర్వన్ జుమీ “

ఆ – యేమీ = ఆశ్చర్యం కోపం కలిపి ) ఆ ఏమిటి ?

పుణ్య + ఆవాసమున్ = పుణ్యానికి నిలయమైన

ఒక = ఒక

రాణివాసమును = రాణివాసాన్ని

తెచ్చినా వా = బందీగా తీసుకొచ్చావా ?

ఏ హైందవుఁడు + ఐననూ = హైందవుడు ఎవడైనా

ఈ గతిన్ = ఈ విధంగా

అమర్యాదన్ = మర్యాద తప్పి ( మర్యాద లేకుండా

ప్రవర్తించును + ఏ = ప్రవర్తిస్తాడా ?

మా + ఆజ్ఞన్ = నా ఆజ్ఞను

గమనింపవు + ఓ = గమనించలేదా ? ( పట్టించుకోలేదా?)

జయ = ( యుద్ధంలో ) విజయం పొందిన

మద + ఉన్మాదంబునన్ = గర్వం మత్తులో

రే( గి = అతిశయించి

నీ = నీ యొక్క

ఆయుః + సూత్రములు = ప్రాణాలనే సూత్రాలు ( దారాలు )

ఈవ = నీవే

త్రుంచుకొనెదు + ఓ = తెంచుకుంటావా ?

ఔత్యము = ఈ తెగింపును ( గర్వమును )

ఓర్వన్ + చుమీ = సహించను సుమా !

భావం : ” ఆ ఏమిటి ? పుణ్యానికి నిలయమైన ఒక అంతఃపుర కాంతను బందీగా పట్టి తీసుకువచ్చావా ? ఏ భారతీయుడైనా ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తిస్తాడా ? నా ఆజ్ఞను నీవు గమనింపలేదా ? విజయం పొందిన గర్వపు మత్తుతో చెలరేగి , నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా ? ఈ పొగరుబోతుతనాన్ని నేను సహింపను సుమా ! ”

విశేషం : అబ్బాజీ సోన్దేవుడు శివాజీ యొక్క సైన్యాధిపతి . సోన్దేవుడు శివాజీ ఆజ్ఞపై కళ్యాణి దుర్గాన్ని జయించి , అక్కడ పాలించే తురక సర్దారును బంధించి , అతనితో పాటు అతని అంతఃపుర కాంతను కూడా శివాజీ వద్దకు బందీగా తీసుకుని వచ్చాడు . అప్పుడు శివాజీ తన సైన్యాధిపతి సోన్దేవునితో అన్నమాటలు ఇవి . ( గమనిక : శివాజీ తన సైన్యాధిపతులు దండయాత్రలకు వెళ్ళేటప్పుడు , బీదసాదలకూ , పౌరులకూ , పతివ్రతలకూ , గోబ్రాహ్మణులకు ఎటువంటి హానీ చేయవద్దని వారిని హెచ్చరించి పంపేవాడు . )

(భావం : ” ఆ ఏమిటి ? పుణ్యానికి నిలయమైన ఒక అంతఃపుర కాంతను బందీగా పట్టి తీసుకువచ్చావా ? ఏ భారతీయుడైనా ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తిస్తాడా ? నా ఆజ్ఞను నీవు గమనింపలేదా ? విజయం పొందిన గర్వపు మత్తుతో చెలరేగి , నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా ? ఈ పొగరుబోతుతనాన్ని నేను సహింపను సుమా ! ”

విశేషం : అబ్బాజీ సోన్దేవుడు శివాజీ యొక్క సైన్యాధిపతి . సోన్దేవుడు శివాజీ ఆజ్ఞపై కళ్యాణి దుర్గాన్ని జయించి , అక్కడ పాలించే తురక సర్దారును బంధించి , అతనితో పాటు అతని అంతఃపుర కాంతను కూడా శివాజీ వద్దకు బందీగా తీసుకుని వచ్చాడు . అప్పుడు శివాజీ తన సైన్యాధిపతి సోన్దేవునితో అన్నమాటలు ఇవి . ( గమనిక : శివాజీ తన సైన్యాధిపతులు దండయాత్రలకు వెళ్ళేటప్పుడు , బీదసాదలకూ , పౌరులకూ , పతివ్రతలకూ , గోబ్రాహ్మణులకు ఎటువంటి హానీ చేయవద్దని వారిని హెచ్చరించి పంపేవాడు . )

‘ పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికీ పుట్టిళ్ళు ‘ దీన్ని సమర్థిస్తూ సమాధానం రాయండి . ” పల్లెటూరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది .” మీ అభిప్రాయం తెల్పండి .

పల్లెటూళ్ళలో జీవితం ప్రశాంతంగా ఉంటుంది . చక్కని గాలి , ఎండ , నీరు , ఆహారము ప్రతి ఒక్కరికీ లభిస్తుంది . అక్కడ చక్కని ప్రకృతి శోభ ఉంటుంది .

పచ్చని పొలాలు కలకలలాడుతూ , గాలికి తలలాడిస్తూ గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ముంచెత్తుతాయి . ప్రజలందరికీ పాడి పంటలు ఉంటాయి . పొయ్యి కిందికీ , పొయ్యి మీదికీ , వారికి కావలసినవన్నీ అక్కడే దొరుకుతాయి . గ్రామంలో చేతివృత్తుల వారు ఒకర్ని ఒకరు అన్నదమ్ములుగా భావిస్తూ పరస్పరం ఒకరికొకరు సాయపడతారు . పల్లెల్లో ( లేదా ) March ఒకరి ఇంట్లో పెళ్ళయితే , ఊరందరికీ అది పండుగ . పల్లెల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ముగ్గులు , గొబ్బిళ్ళు , భోగి మంటలు , సంక్రాంతి ప్రభలు మహావైభవంగా తీర్థాలూ సాగుతాయి . హరిదాసులు , గంగిరెద్దులు , పగటివేషధారులూ , వారి చక్కని పాటలూ ఆనందాన్ని ఇస్తాయి . గ్రామీణులు ఆనందంగా నవ్వుతూ కలకలలాడుతూ ఒకరిని ఒకరు బంధుత్వంతో పలకరించుకుంటూ , కష్టసుఖాల్లో అందరూ పాలు పంచుకుంటారు . గ్రామాలు పాడిపంటలకు నిలయాలు . అవి ప్రకృతి రమణీయతకు పుట్టిళ్ళు . సృజనాత్మకంగా

పల్లె గొప్పదా ? పట్నం గొప్పదా ? , పల్లెటూళ్ళు ప్రశాంత జీవితం , అమరావతి విశ్లేషణ

GET MORE JOBS DETAILS CLICK HERE