Heating politics in the AP
Spread the love

Heating politics in the AP

Heating politics in the AP News

TELUGU SPOORTHI NEWS : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నా ఇప్పుడు అక్కడ పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది . అధికార , విపక్ష నేతల పొత్తుల ప్రస్తావనలతో ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి . సీఎం అభ్యర్థిపైనా అక్కడి రాజకీయం కాకరేపుతోంది . ఏపీలో రాజకీయ పొత్తుల అంశానికి సంబంధించిన టాప్ అంశాలు క్రింది విధంగా చూడ గలరు.


1 ఎన్నికలకు రెండేళ్ల టైమ్ ఉంది . ముందస్తు పవనాలు ముసురుకోలేదు . కానీ ఏపీలో అప్పుడే రాజకీయం వేడెక్కింది . మిత్రుల ( బీజేపీ , జనసేన ) మధ్య సీఎం . సీటు పంచాయతీ మొదలైంది . ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చేందుకు ప్రతిపక్షాలు కుస్తీ పడుతున్నాయి .
2 పొత్తుల వ్యవహారంపై బీజేపీతో పాటు టీడీపీలోనూ చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది . టీడీపీతో పొత్తు కుదిరినా పవనే సీఎం అభ్యర్థి అంటోంది జనసేన , ఆ పార్టీ వ్యూహాలు , నేతల కామెంట్లను జాగ్రత్తగా పరిశీలిస్తోంది టీడీపీ పొత్తులపై ఆచితూచి స్పందిస్తోంది .
3 పవన్ కల్యాణ్ పొత్తు కామెంట్స్ పై ఏపీ బీజేపీ కోర్ కమిటీలో కూడా చర్చ నడిచింది . పవన్ మాటల వెనుక ఆంతర్యాన్ని , పొత్తు అంశాలపై లోతుగా విశ్లేషణ జరిగినట్లు తెలుస్తోంది పొత్తులపై రాష్ట్ర నేతలెవ్వరూ నోరు మెదపొద్దని నడ్డా ఆదేశించారు.
4 పవన్ మూడు ఆప్షన్లను .. సీఎం అభ్యర్థిగా జనసేన నేతల డిమాండ్లపై పెద్దగా రియాక్ట్ కావొద్దని ఏపీలోని పార్టీ శ్రేణులకు సూచించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా .
5 పవన్ మూడు ఆప్షన్లను .. సీఎం అభ్యర్థిగా జనసేన నేతల డిమాండ్లపై పెద్దగా రియాక్ట్ కావొద్దని ఏపీలోని పార్టీ శ్రేణులకు సూచించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా .
6 పవన్ తమతో టచ్ ఉన్నారని తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నామని వివరించారు నడ్డా ఎన్నికల టైమ్లో ఏ పార్టీతో ఎలా వ్యవహరించాలనేది పార్టీ హైకమాండ్ పరిధిలో అంశమని , ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు . 18 రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చిన హైకమాండకు ఏపీని ఎలా డీల్ చేయాలో తెలీయదని అనుకుంటున్నారా ? అని ప్రశ్నించారు .
7 ఏపీలో బీజేపీకి బూస్ట్ ఇస్తున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా . పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించిన నడ్డా … ప్రస్తుతం రాజమండ్రిలో పర్యటిస్తున్నారు . రాజమండ్రి అడ్డాగా నడ్డా ఏదైనా బాంబు పేలుస్తారా ? పొత్తులపై ఇన్ డైరెక్ట్ సిగ్నల్స్ పంపిస్తారా ? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది .
8 పవన్ రియల్ హీరో కాదు రీల్ హీరో అని విమర్శించారు మంత్రి రోజా . పదవుల కోసం ఆరాటం తప్ప జనం కోసం ఆయన చేసిందేమీ లేదని , చేసేదేమీ లేదన్నారు . తిరుపతిలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు మంత్రి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 160 స్థానాలు తమవేనన్నారు రోజూ .
9 నడ్డా నోట పవన్ కల్యాణీమాట రావాల్సిందే అంటున్నారు జనసేన నేతలు . ఈ టూర్లో ఆయన కచ్చితంగా మాట్లాడాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే తమ కార్యాచరణ ఏంటో చర్చించి ప్రకటిస్తామంటున్నారు.