Pawan Kalyan comments shaking the state – రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న పవన్ కామెంట్స్
Andhra Pradesh పొత్తులపై టీడీపీ అధినేత మనసులో ఏముంది ? పవన్ కామెంట్స్ తర్వాత టీడీపీ ఎందుకు నోరు మెదపడం లేదు పవన్ పెట్టిన కండీషన్స్
Andhra Pradesh :- పొత్తులపై టీడీపీ అధినేత మనసులో ఏముంది ? పవన్ కామెంట్స్ తర్వాత టీడీపీ ఎందుకు నోరు మెదపడం లేదు . పవన్ పెట్టిన కండీషన్స్ కు చంద్రబాబు సై అంటారా ? సీఎం సీటు పవన్ కు ఇవ్వడానికి ఒప్పుకుంటారా ? బీజేపీ – జనసేన పంచాయతీ తెగిన తర్వాతే క్లారిటీ ఇస్తారా ? ఏపీ పాలిటిక్స్లో చోటు చేసుకుంటున్న ఆసక్తికర పరిణామాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం రాండి
ఏపీలో రాజకీయమంతా పొత్తుపొడుపుల మీదే నడుస్తోంది . పొత్తులపై జనసేనాని కామెంట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది.ఇప్పటిదాకా పవన్ తో కలిసి వెళ్లాలని టీడీపీ మనసులో ఉన్నప్పటికీ .. వేచిచూసే ధోరణిలో ఉన్నారు అధినేత చంద్రబాబు.ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని … అప్పుడే పొత్తుల వ్యవహారం ఎందుకని కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు చెప్పుకొచ్చారు . కానీ సడెన్ గా పవన్ పెట్టిన ప్రపోజల్స్ తో టీడీపీకి చిక్కొచ్చిపడిందనే చెప్పాలి . పవన్ పెట్టిన మూడు ఆప్షన్ లలో ఒకదానితో టీడీపీకి లింక్ ఉంది . ఇదే సమయంలో టీడీపీ వాళ్లు తగ్గాలనే ఇండికేషన్ కూడా ఇచ్చారు పవన్ . జనసేనాని వ్యాఖ్యలతో పొత్తులపై లెక్కలు వేసుకుంటున్నారు పసుపు నేతలు . అధినేత చంద్రబాబు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా కింది స్థాయి నేతలు మాత్రం రకరకాలుగా చర్చించుకుంటున్నారు . ఇటీవల జరిగిన మహానాడు , బాదుడే బాదుడు కార్యక్రమాల తర్వాత సొంతంగా అయినా ప్రభుత్వం స్థాపిస్తామనే ధీమా కొంతమంది నేతల్లో కనిపిస్తుంది . అసలు పవన్ ఉన్నా లేకున్నా టీడీపీకి డోకా లేదని కూడా కొంతమంది నాయకుల నుంచి వినిపిస్తున్న మాట.అంతేకాదు కొంతమంది తమ్ముళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ అవసరం లేదనే వాదన కూడా తెరమీదకి తెస్తున్నారు.మరికొంతమంది మాత్రం పొత్తుల వల్ల ఇద్దరికీ లాభం అంటూనే సీఎం సీటు విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు . 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు .. పవన్ కు సీఎం సీటు ఇస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు . మరోవైపు సీనియర్ నేతలు మాత్రం త్వరలోనే చంద్రబాబు దీనిపై క్లారిటీ ఇస్తారని చెప్పుకొస్తున్నారు . ప్రస్తుతం బీజేపీ జనసేన మధ్య సీఎం పదవి పై స్పష్టత లేకపోవడంతో మిత్రుల మధ్య క్లారిటీ వచ్చిన తర్వాతే ముందడుగు వేస్తామని చెప్పుకొస్తున్నారు . నాయకులతో పాటు కేడర్ లో ఇప్పుడు ఎలాంటి చర్చ జరిగినా .. అధినేత తీసుకునే నిర్ణయమే ఫైనల్ అంటున్నారు . పొత్తుల వ్యవహారంపై ఇప్పటికిప్పుడే కాకుండా కొంతకాలం వేచి చూసిన తర్వాత పార్టీలో చర్చించిన తర్వాత మాత్రమే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని కూడా పార్టీలో జరుగుతున్న చర్చ . మొత్తంగా పవన్ వ్యాఖ్యలైతే జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి మింగుడుపడటం లేదనే చెప్పాలి.
READ IN ENGLISH NEWS
All the politics in the AP are running yours on compromises. After Janasena’s comments on alliances, there will be a heated debate in the Telugu Desam party. Even though the TDP is in the mood to go with Pawan till now, leader Chandrababu is in a wait – and see situation. But it has to be said that TDP was suddenly caught up with the proposals put forward by Pawan. TDP has a link with one of the three options given by Pawan. At the same time, Pawan also hinted that the TDP would fall. Yellow leaders are counting on alliances with Janasena’s remarks. Although Chief Minister Chandrababu did not give any clarity, the lower level leaders are discussing in various ways. Dhima is seen by some leaders as the one who will form the government on his own after the recent Mahanada and Baadu Baadu programs. There are rumors circulating among some leaders that the TDP does not have a doka, whether it is the real Pawan or not. Chandrababu, who has been the CM for 14 years, is expressing doubts whether Pawan will be given the CM seat. On the other hand, senior leaders say that Chandrababu will clarify this soon. Currently, the BJP is said to be moving ahead only after clarity among allies over the lack of clarity on the CM post among the Janasena. No matter what the discussion is now in the cadre along with the leaders .. the final says that the decision will be taken by the leader. There is also talk in the party that Chandrababu will take a decision on the issue of alliances only after waiting for a while instead of now. On the whole, Pawan’s remarks do not mean that the Telugu Desam Party in Josh will not be swallowed up.