HEART DISEASES IN TELUGU
Spread the love

HEART DISEASES IN TELUGU

Heart Diseases Information / గుండె జబ్బుల సమాచారం

Heart Diseases ( గుండె జబ్బులు) : ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది . మనం తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శాఖాహారులతో పోలిస్తే మాంసాహారం తీసుకునేవారు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఎక్కువ అని మరో పరిశోధన వెల్లడించింది . ఇటీవల బ్రిటన్లో గుండెజబ్బుల బారిన పడిన 4,20,000 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తాజా అధ్యయనం చేశారు . శాఖాహారులు గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయే అవకాశం చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు . గ్లాస్గో విశ్వవిద్యాలయానికి ( University of Glasgow ) చెందిన నిపుణులు ఈ పరిశోధన చేశారు ఈ అధ్యయనాన్ని యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు . పెస్కటేరియన్ డైట్ను ప్రోత్సహించడం వల్ల గుండెజబ్బుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు వెల్లడించారు . శాకాహారులు , చేపలు , పౌల్ట్రీ ఉత్పత్తులు , మాంసం తినేవారు గుండె జబ్బుల బారిన పడే లేదా చనిపోయే ప్రమాదం ఎంతవరకు ఉందనే వివరాలను పరిశోధకులు విశ్లేషించారు . దీనికి సంబంధించిన డేటాను యూకే బయోబ్యాంక్ నుంచి సేకరించారు.

HEART DISEASES IN TELUGU

READ IN ENGLISH

HEART DISEASES : The number of people getting sick is increasing nowadays. Health depends on the food we eat. Another study found that vegetarians were more likely to be obese than vegetarians. The latest study is based on data from 4,20,000 people recently diagnosed with heart disease in Britain. Vegetarians are less likely to die of heart disease, say researchers.

The study was conducted by experts from the University of Glasgow and was published in the European Journal of Heart. Researchers have found that promoting a Pescatarian diet can reduce the risk of heart disease. Researchers have analyzed the risk of heart disease and death in vegetarians, fish, poultry products and meat eaters. Data on this were collected from UK Biobank.

1. మాంసం ఎక్కువగా తింటే ప్రమాదమే . ఇతరులతో పోలిస్తే మాంసం ఎక్కువగా తినేవారిలో 94.7 శాతం మంది ఊబకాయం , గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువని పరిశోధకులు గుర్తించారు . మాంసం ఎక్కువగా తినేవారితో పోలిస్తే చేపలను మాత్రమే ఆహారంలో భాగం చేసుకునేవారు హార్ట్ స్ట్రోక్ , గుండె జబ్బులు , ఇతర గుండె సంబంధ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం చాలా తక్కువని వారు చెబుతున్నారు . మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు పండ్లు , కూరగాయలు , ఫైబర్ , మంచి కొవ్వులు , నీరు అధికంగా లభించే పదార్థాలకు దూరంగా ఉంటున్నారని గుర్తించారు.

2. శాఖాహారులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ , వీరు మాంసంకంటే హానికరమైన ఫాస్ట్ఫుడ్ , స్మూతీ డ్రింక్స్ , పిజ్జాలు .. వంటివి తింటున్నారని గుర్తించారు . కేవలం మాంసాహారం మానేసి , హానికరమైన ఇతర పదార్థాలను తీసుకుంటే అనారోగ్యాల ప్రభావం ఏమాత్రం తగ్గదని వారు చెబుతున్నారు . చేపలను మాత్రమే తినేవారు ఈ రెండు గ్రూపులతో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నారని గుర్తించారు . వీరు ఇంట్లో చేసుకున్న వంటలు తినడానికి ఆసక్తి చూపుతున్నారట .

HEART DISEASES IN TELUGU

3. అలాంటి వారికి గుండె జబ్బులు తక్కువ .. మాంసాహారానికి బదులుగా పెస్కటేరియన్ డైట్ ( మాంసానికి బదులుగా కేవలం చేపలు మాత్రమే తినేవారు ) ను ప్రోత్సహించాలని గ్లాస్గో యూనివర్సిటీ ప్రొఫెసర్ , అధ్యయన బృంద సభ్యుడు జిల్ పెల్ చెబుతున్నారు . పెన్కటేరియన్ డైట్ను ఫాలోఅయ్యేవారు గుండె జబ్బులు , స్ట్రోక్ గుండె వైఫల్యం వంటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం తక్కువని తమ పరిశోధనలు తేల్చాయని ఆయన చెప్పారు . మాంసం వినియోగాన్ని తగ్గించడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఆయన చెప్పారు . చేపలు ఎక్కువగా తినేవారికి పాలిఅన్ శాచురేటెడ్ కొవ్వులు శరీరానికి అందుతాయి . ఇవి గుండెజబ్బులను సమర్థంగా ఎదుర్కోగలవని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

1. It is dangerous to eat too much meat. The researchers found that 94.7 percent of people who ate more meat had a higher risk of obesity and heart disease than others. They say people who eat only fish are less likely to have heart attacks, heart disease and other cardiovascular diseases than those who eat more meat. Non-vegetarians have been found to stay away from fruits, vegetables, fiber, good fats and water-rich foods. They say that simply avoiding meat and consuming other harmful substances will not reduce the impact of illness. Only fish eaters were found to be healthier compared to these two groups. They are interested in eating homemade dishes. 3. Jill Pell, a professor at the University of Glasgow and a member of the study team, says that such people are less likely to have heart disease. He says his research shows that people who follow the Pencaterian diet are less likely to develop diseases such as heart disease and stroke. Reducing meat consumption is also good for the environment, he said. People who eat a lot of fish get polyunsaturated fats. Researchers also say that cats need to be included in any precautionary measures against the virus.