ఏపీలో బర్త్, డెత్ సర్టిఫికెట్లకు కొత్త రూల్స్.. 21 రోజుల్లోగా తీసుకోకుంటే ఇబ్బందే

ఏపీలో బర్త్, డెత్ సర్టిఫికెట్లు తీసుకునేందుకు కొత్త రూల్స్.. 21 రోజుల్లోగా తీసుకోకుంటే ఇబ్బందే, పూర్తి వివరాలివే

ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజలకు ముఖ్యమైన గమనిక.. జనన (బర్త్), మరణాల (డెత్) నమోదుకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కేంద్రం ఆదేశాలు మేరకు కొత్త నిబంధనల్ని నేటి నుంచి అమలు చేస్తున్నారు.
21 రోజుల గడువులోగా జనన, మరణాల వివరాలు సమర్పించేవారికి ధ్రువపత్రాలను ఉచితంగానే జారీ చేస్తారు. ఒకవేళ ఆ 21 రోజుల గడువు దాటిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ కఠినంగా ఉంటుంది. 1969 రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బర్త్‌ అండ్‌ డెత్స్‌ యాక్టు సెక్షన్‌ 13కి చేసిన సవరణల ప్రకారం.. ఆలస్యంగా నమోదు చేసుకునేవారికి కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. శిశువు పుట్టినన తర్వాత 21 రోజుల్లోగానే.. ఎవరైనా చనిపోతే 21 రోజులలోపు సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే.

అంతేకాదు జననం, మరణం సంభవించిన రోజు నుంచి ఏడాది దాటాక, రెండేళ్లలోపు నమోదుకు దరఖాస్తు చేసుకునేవారికి కొత్త రూల్ వచ్చింది. వీరి సమాచారాన్ని

సంబంధిత రిజిస్ట్రార్‌ నేరుగా నమోదు చేయరు. అప్పుడు జిల్లా మేజిస్ట్రేట్, సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండేళ్లు దాటిపోయిన తర్వాత దరఖాస్తు చేసుకుంటే ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాలు తీసుకోవాలి. అప్పుడే అధికారులు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనల్ని అమలు చేసే బాధ్యత రిజిస్ట్రార్‌లకు అప్పగించారు. నేటి (అక్టోబర్ 1) నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిబంధనలు మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు, గ్రామ పంచాయితీల్లో అమల్లోకి వచ్చాయి.

బర్త్, డెత్ సర్టిఫికేట్ల కోసం ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఒకవేళ ఒక జిల్లాకు చెందిన వ్యక్తి మరో జిల్లాలో చనిపోతే.. ఆయన మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబ సభ్యులు డెట్ సర్టిఫికెట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటున్నారు.

చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం నిర్వహించాక ఆస్పత్రి జారీచేసే ధ్రువపత్రాన్ని మీసేవా కేంద్రాల్లో సమర్పించి డెత్ సర్టిఫికెట్‌ పొందవచ్చని తెలిపారు. స్కూళ్లలో అడ్మిషన్లు, చదువుకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు, ఇరత ప్రభుత్వ సేవల కోసం ఈ బర్త్, డెత్ సర్టిఫికెట్లు చాలా ముఖ్యం. అందుకే ఈ విషయాన్ని గమనించాలని.. 21 రోజుల్లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రతి ఒక్కరు ఈ నిబంధనల గురించి తెలుసుకోవాలంటున్నారు. 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు.

Leave a Comment

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.