KURNOOL TELUGU NEWS
Spread the love

KURNOOL TELUGU NEWS

KURNOOL DAILY UPDATE NEWS

11 – MAY – 2023 నేటి వార్తలు

కర్నూలు జిల్లా వార్తలు : మహిళా వాలంటీర్ ఆత్మహత్య

ప్యాపిలి మండలంలోని జక్కసానికుంట్ల గ్రామానికి చెందిన గ్రామం మహిళా వాలంటీర్ ఆత్మహత్య చేసుకోవడం ప్యాపిలి మండలంలో తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన నబీరసూల్ కు తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన ఆఫ్రిన్ ఇచ్చి 2018లో వివాహం చేశారు. అప్పటినుండి గ్రామ వాలంటీర్ గా జక్కసానికుంట్లలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.

కర్నూలు జిల్లా వార్తలు : బైక్పై నుంచి కిందపడి యువకుడు మృతి

నగరంలోని పాతబస్తీకి చెందిన హకీ నిస్సాద్ (22) అనే యువకుడు బైక్పై నుంచి కింద పడి మృతి చెందాడు. బైక్పై వెళ్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న డివైడర్ ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి సోహెల్ అఫ్రోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నంద్యాల: గుండెపోటుతో టీచర్ మృతి

చాగలమర్రి గ్రామంలోని కూలూరు రహదారిలో నివాసం ఉంటున్న వ్యాయామ ఉపాధ్యాయుడు యేసుబాబు (53) గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన నీలాపురం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి నుంచి వాకింగ్కు వెళ్లి దారిలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. యేసుబాబు మృతిపై ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్ సంఘ నాయకులు సంతాపం ప్రకటించారు.

జీవితంపై విరక్తి.. యువతి సూసైడ్

కడుపునొప్పి తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని అయ్యప్ప ఆలయ సమీపంలోని గిరిప్రసాద్ నగర్ లో జరిగింది. పూజిత (20) గత కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3వ పట్టణ ఎస్ఐ నాగ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పేదల మేలు కోరే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం

పేదల మేలు కోరే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. గురువారం కర్నూలు మండలం నూతన పల్లె గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని వర్గాలవారికి మేలు చేస్తున్నామని, ప్రజలను ఓటు అడిగే నైతిక విలువ ఒక్క వైసీపీకి ఉందని అన్నారు. అనంతరం స్థానిక సమస్యలపై ప్రజలని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘మీరు అభివృద్ధి చేస్తారా.. లేక మమ్మల్నే చేయమంటారా’

వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లైనా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయని ఆలూరు టీడీపీ ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ విమర్శించారు. గురువారం ఆలూరు నియోజకవర్గం పి.కోటకొండ క్రాస్ నుంచి బేతపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు వద్ద సెల్ఫీ దిగారు. స్థానిక MLA, కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాంకు చేతనైతే అభివృద్ధి చేయాలని లేకపోతే, TDP ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.

డీఐజీ తనిఖీలు చేపట్టారు

కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ను కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్ బుధవారం వార్షిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ముందుగా పోలీసు గార్డు సిబ్బంది డీఐజీకి గౌరవందనం చేశారు. అనంతరం దర్యాప్తులు, పెండింగ్ కేసుల పురోగతి పై వివరాలను ఆరా తీసి, క్రైమ్ రివ్యూ చేశారు. సీజ్ చేసిన వాహనాలు, పోలీసుస్టేషన్ పరిసరాలను పరిశీలించారు.